👉గంగారెడ్డి హత్య పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం!
👉గంగారెడ్డి సంతాప సభలో…
J.SURENDER KUMAR,
ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టసుఖాలలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీటీసీ గంగా రెడ్డి మృతి చాలా బాధాకరమని, ఆయన మృతి జిల్లా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక దేవి శ్రీ గార్డెన్స్ లో మంగళవారం జరిగిన జాబితపూర్ మాజీ ఎంపీటీసీ, పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి సంతాప సభలో అన్నారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, చొప్పదండిఎమ్మేల్యే మెడిపెల్లి సత్యం పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎటువంటి కార్యక్రమం నిర్వహించిన స్వర్గీయ గంగారెడ్డి ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొనేవారనీ అన్నారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ప్రతి విషయంలో వెన్నంటి ఉండే గంగారెడ్డి హత్యకు గురయ్యారని తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ, డీఎస్పీల తో మాట్లాడి చర్యలు చేపట్టాలని ఆదేశించామన్నారు.

గంగారెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని,జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నాయకత్వములో మేము అండగా ఉంటామని, మేము కూడా ఒక కార్యకర్త స్థాయి నుండే వచ్చామని, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సహకారంతోనే ఇప్పుడు ఈ స్థాయిలో మేము ఉన్నామని, కాబట్టి కార్యకర్తల కష్టసుఖాలు మాకు తెలుసునని, వారి కష్టాల్లో సుఖాల్లో మేము వారికి తోడుగా ఉంటామని, ప్రతి కార్యకర్తను రక్షించుకునే బాధ్యత మాదేనని, గంగారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే అన్నారు.

సంతాపసభలో భారీగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు
👉పరామర్శ..

ధర్మపురి మండలం ఆరపెల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బొర్లకుంట రాజయ్య ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాజయ్య కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు..

ఆరేపల్లిలో రాజయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు..వారి కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు.