కాంగ్రెస్ నాయకుడు గంగారెడ్డి హత్య దారుణం !

👉హత్య వెనుక ఎంత పెద్ద నాయకుడు ఉన్న విడిచి పెట్టే ప్రసక్తే లేదు.


👉ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జాబితాపూర్ మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి హత్య  దారుణమని, హత్య వెనుక ఎంత పెద్ద నాయకుడు ఉన్నా ప్రభుత్వం విడిచి పెట్టే ప్రసక్తి లేదని, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


మాజీ మంత్రి,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  ప్రధాన అనుచరుడు, జాబితాపూర్ మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మారు గంగారెడ్డి మంగళవారం  ఉదయం హత్యకు గురై మృతి చెందిన విషయం తెలిసి తన నియోజకవర్గం జగిత్యాలకు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు.


భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో పాటు లక్ష్మణ్ కుమార్ ఆస్పత్రి ముందు బైఠాయించారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గంగారెడ్డి  పార్థివ దేహానికి ఆస్పత్రిలో నివాళులు అర్పించారు. గంగారెడ్డి అంతిమ యాత్ర, దహన సంస్కారాల కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గంగారెడ్డి మృతి చాలా బాధాకరం, ఆయన మృతి పార్టీకి తీరని లోటని, 

హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, హత్య వెనుక ఎవ్వరూ ఉన్న, ఎంత పెద్ద నాయకుడు ఉన్న ప్రభుత్వం విడిచి పెట్టదన్నారు.

హత్య చేసిన నిందితుడిని ఇప్పటికే పోలీసుల అదుపులోకి తీసుకున్నారని, అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికీ జిల్లా ఎస్పీ పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగిందనీ  మృతుడు గంగారెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ జిల్లా రాష్ట్ర పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని లక్ష్మణ్ కుమార్ అన్నారు.