ధాన్యం కొనుగోలులో ఇబ్బంది కలగవద్దు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

👉ఆరు కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో..


J.SURENDER KUMAR,


రైతులు కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు రైతులకు

ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు కొనుగోలు

కేంద్రాల నిర్వహకులు చర్యలు చేపట్టాలని ధర్మపురి ఎమ్మెల్యే

ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు.


ధర్మపురి నియోజకవర్గం పేగడపెల్లి మండలంలోని ల్యాగలమర్రి, రామభద్రుని పల్లె, ఐతుపల్లి , ముద్దుల పల్లె, రాజారాం పల్లె, నామాపూర్, గ్రామాల్లో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన ఆరు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా వరి ధాన్యం కొనుగోళ్ళు చేపట్టాలని, ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని, రైతుల పండించిన నాలుగు రకాల సన్న వడ్లకు ఐదువందల రూపాయల బోనసు కూడా ప్రభుత్వము ప్రకటించిన విధంగా చెల్లించాలని అధికారులను ఆదేశించారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు