DCMS చైర్మన్ హోదాలో శ్రీకాంత్ రెడ్డి విధులు నిర్వహించరాదు !

👉 డీసీఎంఎస్ మేనేజింగ్ కమిటీలో కోరమ్ సభ్యులు లేరు !


👉కరీంనగర్ డీసీఎంఎస్ కమిటీకి నోటీసులు జారీ !


J .SURENDER KUMAR,


ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహకార మార్కె టింగ్ సొసైటీ

పాలకవర్గ (డిసిఎంఎస్) చైర్మన్ హోదాలో శ్రీకాంత్ రెడ్డి,

తన విధులు, కార్యకలాపాలు నిర్వహించరాదు,

తక్షణమే నిలిపి వేయాల్సిందిగా సహకారశాఖ

ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.


మేనేజింగ్ కమిటీలో కోరమ్  లేకపోవడంతో ఇక మీదట ఆర్ధిక లావాదేవీల, నిర్వహణ సహకార సంఘ పాలనాపరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూదు అంటూ ఆర్  సి నం. 2854/2024-B., తేదీ: 30-09-2024.. ద్వారా సహకార శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

👉గత నెల 30న సహకార సంఘ ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వులు.

కరీంనగర్  సహకార సంఘం అసిస్టెంట్ రిజిస్టర్ ఎం లక్ష్మణ చారి గత నెల 23న ఇచ్చిన నివేదికలో డీసీఎంఎస్ మేనేజింగ్ కమిటీలో సభ్యుల కోరమ్ అధ్యక్షుడితో కలిపి కేవలం  నలుగురే సభ్యులు ఉన్నారు అని, అధికారి నివేదికలో పేర్కొన్నారు. కాబట్టి.ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ కోఆపరేషన్ & రిజిస్ట్రార్ ఆఫ్ కోప్ సొసైటీస్  ఇట్టి మేనేజింగ్ కమిటీ ఉనికి చెల్లదు అని  పేర్కొన్నారు.