👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్!
J.SURENDER KUMAR,
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ విద్యావేత్త దళిత సామాజిక వర్గానికి చెందిన ఎం కుమార్ ను నియమించడం పట్ల ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తో కలిసి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…
యూనివర్సిటీ ల వైస్ ఛాన్సలర్ల నియామకాల్లో ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర లో ఇప్పటి వరకు ఒక్క దళిత విద్యావేత్త వైస్ ఛాన్సలర్ నియామకం జరగలేదని, మహిళా యూనివర్సిటీ కి గిరిజన మహిళ విద్యావేత్త ను వీసీగా నియమించడం సంతోషదాయకం అని అన్నారు.
అన్నీ వర్గాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేస్తున్నారనీ, మాజీ సీఎం కేసీఆర్.దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, మూడెకరాల భూమి ఇస్తానని రాష్ట్ర ప్రజలను మోసం చేశాడన్నారు. బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయంలో ఎంత మంది నిరుద్యోగులకు ఉద్యోగులు ఇచ్చారో చెప్పాలని, పది సంవత్సరాలు అధికారంలో ఉండి టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వలేదని, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.
గ్రూప్ 1 అభ్యర్థుల విన్నపాలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, నిరుద్యోగ యువతను బీజేపీ, బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, బి.ఆర్.ఎస్, బిజెపి నాయకులు కల్లబొల్లి మాటలు నిరుద్యోగులు నమ్మి మోసపోవద్దనీ, ఇరు పార్టీలు ఒక్కటే అని లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉సీఎంను కలిసి కృతజ్ఞతలు…

మీడియా సమావేశానికి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పలువురు ఎమ్మెల్యేలతో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు, అంశాల పై సీఎంతో చర్చించారు.