ధర్మపురి ఆలయ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కలెక్టర్ సమీక్ష !


J.SURENDER KUMAR


ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ ఆలయంలో కోసం పూర్తిగా మిగిలిన అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ వి సత్యప్రసాద్ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలసి ఇంజనీరింగ్, దేవాదాయ, రెవెన్యూ అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.


భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించుటకు, గోదావరి స్నానము చేయు భక్తులకు వసతులు, 60 గదుల ధర్మశాల నిర్మాణం, కె. ఎన్ . ఆర్, షాపింగ్ కాంప్లెక్స్ ను, పుట్ట బంగారము, నాగమయ్య దేవాలయ అసంపూర్తి నిర్మాణా పనులను కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పరిశీలించారు.


దేవాదాయశాఖ ఇంజనీరింగ్ అధికారులు అసంపూర్తి పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలనీ సూచించారు. అదే విధంగా వివిధ నిర్మాణ పనులకు ₹ 50 కోట్లకు అంచనాలు సిద్ధం చేసి నివేదిక ఇవ్వాలని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. తాను ముఖ్యమంత్రి తో చర్చించి నిధులు మంజూరు చేయిస్తానని, జాప్యం లేకుండా అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలని ఎమ్మెల్యే అన్నారు .


ప్రధానంగా గోదావరి తీరంలో అత్యవసరంగా భక్తులు సేద తీరుటకు శాశ్వతంగా డార్మెటరీ హాల్స్, భక్తుల సౌకర్యార్థం బట్టలు మార్చుకొను గదులు, మరియు షవర్స్ ఏర్పాటు చేయుటకు సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.