J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి పట్టణంలో ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటుకు నా శాయశక్తుల కు కృషి చేస్తానని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
పట్టణ ప్రజల, యాత్రికుల సౌకర్యార్థం సౌలభ్యం కోసం ధర్మపురి నుంచి హైదరాబాద్ నగరానికి రాత్రివేళ ఏసీ బస్ ను శుక్రవారం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
ప్రతి రోజు రాత్రి 11.30 గంటలకు ప్రయాణికుల సౌకర్యార్థం ధర్మపురి నుండి హైదరాబాద్ కి ఏసీ బస్సును ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ బస్సు వల్ల ధర్మపురికి వచ్చే భక్తులకు ప్రయాణికులకు కొంత ఇబ్బందులు తొలగుతాయని, ఈ బస్ ను మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

రానున్న రోజుల్లో ధర్మపురికి బస్ డిపోను కూడా తీసుకురావడానికి తనవంతు కృషి చేస్తామని, ఈ విషయం పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా ఉన్నారని ఈ సందర్భంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు,రెవెన్యూ అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.