ధర్మపురిలో ఇంటిగ్రేటెడ్ వసతి గృహానికి త్వరలో శంకుస్థాపన

👉నైట్ కాలేజీ బోధన సిబ్బంది నియామక ఉత్తర్వులు అందజేత !

👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో త్వరలోనే ఇంటిగ్రేటెడ్ విద్యా వసతి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్టు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం
ధర్మపురిలో మూతపడిన నైట్ కళాశాలను తిరిగి పున ప్రారంభించడానికి ప్రభుత్వ ద్వారా ఉత్తర్వులు జారీ చేయించిన ఎమ్మెల్యే ఆ కళాశాలలో ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా నియామకమైన బోధన సిబ్బందికి నియామక పత్రాలను ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అందజేశారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…


ఇంటిగ్రేటెడ్ వసతి గృహానికి ఇప్పటికే 25 ఎకరాల స్థలాన్ని గుర్తించడం జరిగిందనీ నైట్ కాలేజ్ తిరిగి ప్రారంభించడానికి ఆదేశాలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.


గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ కనీసం ధర్మపురి అభివృద్ధి గురించి ఆలోచించింది లేదని, ధర్మపురిని రెవెన్యూ డివిజన్, నైట్ కాలేజ్ ను తిరిగి ప్రారంభిస్తారని ప్రజలు ఆశించిన అలాంటివి చేయలేదని ఎమ్మెల్యే ఆరోపించారు.


గోదావరి తలాపున ఉంటుంది కానీ ప్రజలకు కనీసం త్రాగు నీటి కష్టాలను దూరం చేయలేకపోయారని ప్రజలకు హాని చేసే ఇథనాల్ ప్రాజెక్టు మాత్రం మంత్రి శంకుస్థాపన చేశారన్నారు. శంకుస్థాపన కు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి పోరాటం చేస్తే మా పైన అక్రమ కేసులు నమోదు చేశారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నైట్ కాలేజ్ ని తిరిగి ప్రారంభించడం సాధ్యం కాదు అని అనేకమంది అన్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.

నేను స్వయంగా ముఖ్యమంత్రి తో విద్యాశాఖ అధికారులతో, మరియు ఎండోమెంట్ మంత్రి మరియు అధికారులతో మాట్లాడి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం జరిగిందని, ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగానే సిబ్బంది నియామకం జరిగిందని, స్వయంగా నా ACDP నిధుల నుండే ₹ 5 లక్షల రూపాయలను కళాశాల మరమ్మతులకు కేటాయించడం జరిగిందనీ, అన్నారు..

నైట్ కాలేజ్ తిరిగి ప్రారంభించడంలో ప సహకరించిన ముఖ్యమంత్రి కి, మంత్రులు శ్రీధర్ బాబు MLC జీవన్ రెడ్డి , కొండ సురేఖ ,పొన్నం ప్రభాకర్ కు అధికారులకు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు