ధర్మపురి పట్టణంలో సంచరిస్తున్న అనుమానిత ముఠా !

J.SURENDER KUMAR,


ప్రముఖ పుణ్యక్షేత్రంగా, నిత్యం రద్దీగా ఉండే ధర్మపురి పట్టణంలో అనుమానిత ముఠా సంచరిస్తున్నట్టు తెలిసింది.
గత కొన్ని రోజుల క్రితం అనుమానిత ముఠా పట్టపగలు పట్టణంలోని ఓ ఇంటి తలుపులను రెండు మూడు సార్లు గట్టిగా తట్టారు, ఇంటి యజమాని పేరుతో పిలిచినట్టు సమాచారం.

రిక్కీ నిర్వహిస్తున్న దృశ్యం (సీసీ కెమెరాలు రికార్డ్ అయింది)

ఆ ఇంటి లో గృహిణి తలుపు ఒకవైపు తెరిచి చూడగా ఇద్దరు దృఢ కాయలు ఇంటి వాకిట పోర్టికోలో నిలిచిన ఉన్నారు. అందులో ఒకడి చేతిలో తెల్లటి రుమాలు ( కర్చీఫ్) ఉండడం ( ముఖానికి అద్దడానికి సిద్ధం ఉన్నట్టు ఆ గృహిణి గుర్తించింది) గృహిణి భయంతో క్షణాల్లో తలుపు వేసుకొని లోనికి గడియ ( గొళ్ళెం) పెట్టి తన బంధువులకు ఫోన్ చేసింది.

వేచి చూస్తున్న దృశ్యం ( సీసీ కెమెరాలు నమోదు)

ఇంటి వాకిట్లో ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు పరుగులు తీసినట్టు తెలిసింది. అనుమానిత ముఠా, ఏదో ఒక నెపంతో పట్టణంలో సంచరిస్తూ రిక్కి నిర్వహిస్తూ ప్రముఖుల పేర్లు, వారి ఇంటి పరిసరాలు గుర్తించి తమ ప్లాన్ అమలు చేస్తారనే చర్చ.


👉పోలీసుల అదుపులో..?

ఇంటి పరిసరాల నుంచి పరుగులు తీస్తున్న దృశ్యం ( సీసీ కెమెరాలో)


మత్తుమందును యువతకు విక్రయించే ముఠా సభ్యులలో ఒక్కరో, ఇద్దరో పోలీసుల అదుపులో ఉన్నట్టు చర్చ. ఈ అంశం పోలీస్ అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది. అయితే పోలీసుల అదుపులో ఉన్నది మత్తుమందు విక్రయించే ముఠా సభ్యులా ? పట్టణంలో సంచరిస్తున్న అనుమానిత ముఠా సభ్యులా ? అనే అంశం లో పూర్తి వివరాలు తెలియాల్సి

ఉంది. వారిని అదుపులో తీసుకొని ప్రశ్నించి వదిలేశారా ? లేక మరేదైనా కీలక సమాచారం కోసం ప్రశ్నిస్తున్నారు ? అనే విషయంలో వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.