ధర్మపురి సింగిల్ విండో కార్యవర్గం పై అనర్హత వేటు ?

👉 ధర్మపురి విండో లో ₹ 1 . 24 కోట్ల నిధులు దుర్వినియోగం !

👉 నిధుల దుర్వినియోగం పై వివరణ కోరుతూ కార్యవర్గానికి నోటీసులు జారీ !


J.SURENDER KUMAR,


ధర్మపురి ప్రాథమిక సహకార వ్యవసాయ కేంద్ర (సింగిల్ విండో ) లో ₹ 1 , 24, 30, 688. ( కోటి ఇరువది నాలుగు లక్షల ముప్పది వేల ఆరువందల ఎనుబై యెనిమిది ) నిధులు దుర్వినియోగం పై పాలక కార్యవర్గం పై ఎందుకు అనార్హత వేటు వేయకూడదో  వివరణ ఇవ్వాలని జగిత్యాల జిల్లా సహకార అధికారి మనోజ్ కుమార్  నోటీసులు  జారీ చేశారు.


👉వివరాలు ఇలా ఉన్నాయి.


షోకాజ్ నోటీస్ U/s. 21-A.. Rc.No.2251/2024, తేదీ 25-09-2024 ద్వారా జగిత్యాల జిల్లా సహకార సంఘం అధికారి మనోజ్ కుమార్ , జారీ చేసిన నోటీసులో. రంగారెడ్డి జిల్లా DCO . అసిస్టెంట్ రిజిస్టార్ బి. ఆంజనేయులు, మరియు గోల్కొండ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కో, జూనియర్ ఇన్స్పెక్టర్ K. జోషి సొసైటీలో వివిధ అంశాలపై విచారణ జరిపారు.
₹ 1 , 24 , 30 ,b668/ నిధుల వినియోగంలో ఉల్లంఘన జరిగినట్టు వారు నిర్ధారణ చేశారని షోకాజ్ నోటీస్ లో  పేర్కొన్నారు. 

👉 విండో కార్యవర్గానికి జారీ చేసిన నోటీసునోటీసు

ఈ మేరకు విచారణ నివేదికను సహకార చట్టం U/s – 52 పేర్కొంటూ గత నెల 23 న డైరెక్టర్ కు సమర్పించినట్టు  షోకాజ్ నోటీస్ లో పేర్కొన్నారు. నిధుల వినియోగ, నిబంధనలు ఉల్లంఘన అంశంలో,  మీ సంజాయిషీ లో సాక్షాధారాలతో ఈ నోటీసు మీకు అందిన 7 రోజులలో  సమాధానం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.


ఇది ఇలా ఉండగా విండో పాలకవర్గ సభ్యులు కొన్ని రోజుల క్రితం  జిల్లా సహకార సంఘం అధికారిని కలసి వివరణ ఇవ్వడంతో పాటు అధికారితో వాదనకు దిగినట్లు పట్టణంలో చర్చ.


దీనికి తోడు పెగడపల్లి, నంచర్ల, తిమ్మాపూర్, జైన, గొల్లపల్లి, సహకార సంఘాలలో ( సింగిల్ విండో ) కలుపుకొని దాదాపు ₹ 7 కోట్ల వరకు నిధులు దుర్వినియోగం జరగాయని సంబంధిత శాఖ విచారణ అధికారులు ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక విధితమే.

ఈ నివేదిక మేరకు ప్రభుత్వం ఆరుగురు సంఘ C.E.O లను సస్పెండ్ చేస్తూ, వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరిన విషయం తెలిసినదే. సస్పెండ్ అయిన కొందరు CEO లు వారి సస్పెన్షన్ పై స్టే కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు సమాచారం