ధర్మపురి సింగిల్ విండో సొసైటీలో భూ భాగోతం!


👉సొసైటీ సొమ్ము తో భూమి కొన్నారు భూ ఆదాయం ఇతరులు అనుభవిస్తున్నారు !


👉రైతుల సొమ్ముతో  ఆడింది ఆట, పాడింది పాట, రైతుల సొమ్ము రాళ్ల పాలు !


J.SURENDER KUMAR,


రైతుల కష్టార్జిత వాటా సొమ్ము, వడ్డీ సొమ్ములు ధాన్యం

కొనుగోలు కమిషన్ సొమ్ముల తో కొనసాగుతున్న ధర్మపురి

సింగిల్ విండో సొసైటీ  సొమ్ముతో నిర్వాహకులు ఇష్ట

రాజ్యాంగ ఆడింది ఆటగా పాడంది పాటగా కొనుగోలు చేసిన

లక్షలాది రూపాయల భూ బాగోతం ఇది..


దీనికి తోడు గత నెలలో ధర్మపురి సింగిల్ విండోలో నిధులు గోల్ మాల్ జరిగిందని సహకార శాఖ రాష్ట్ర అధికారులు చేపట్టిన విచారణలో  ₹ 1,24,30,688  ( కోటి ఇరువది నాలుగు లక్షల ముప్పది వేల ఆరువందల ఏనుబై యెనిమిది ) దుర్వినియోగం జరిగాయని లేఖ సంఖ్య 2251/2024 -C. తేదీ 25-09-2024 ద్వారా ప్రభుత్వం నిర్ధారించడంతో పాటు సొసైటీలో విధులు నిర్వహించే ఉద్యోగిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.


👉భూ బాగోతం వివరాలు ఇలా ఉన్నాయి !


ధర్మపురి సింగిల్ విండో సొసైటీ సొమ్ముతో నాగారం గ్రామ శివారు, ఆక్సాయి పల్లె (నాయకపు గూడెం)  సమీపంలో  భీముని లొద్ది గుట్ట ప్రాంతంలో కొంత భూమిని 2021 లో కొనుగోలు చేశారు.


ఈ భూమిని ఏ అవసరాల కోసం కొన్నారు ? ఎన్ని ఎకరాలు కొన్నారు ?  పట్టా, అసైన్డ్ భూములా ? అనే విషయంలో స్పష్టత లేదు. అయితే కేవలం 0-27 గుంటలు భూమి మాత్రమే సర్వేనెంబర్ 84/ ఈ /1లో కొనుగోలు చేసినట్టు రికార్డులలో నమోదయింది.


👉 గోదాం కోసమా ? రైస్ మిల్లు కోసమా ?

సొసైటీ భూమికి వెళ్లే దారి.


సొసైటీ నిధులతో గోదాం నిర్మాణం కోసమా ? రైస్ మిల్ నిర్మాణం కోసమా ? అనే విషయంలో నిర్వాహకులకు గాని రైతులకు గాని సమాచారం లేదు.  సొసైటీలో తీర్మానం ఎందు కోసం చేశారో ? అనే విషయం రైతాంగానికి మాత్రం తెలియదు.


ఎరువులు, రైతుల ధాన్యం నిలువ గోదాం నిర్మాణం కోసమా, లేక ధాన్యం కొనుగోలు కేంద్రం  కోసం ఈ భూమిని సొసైటీ కొనుగోలు చేసి ఉండి ఉంటే, రాళ్లు రప్పల తో నడవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అతి కష్టం పై ద్విచక్ర వాహనంపై ఈ భూమి వద్దకు చేరుకోవచ్చు. లారీలు , సరుకుల రవాణా చేసే వాహనాలు ఈ దారి గుండా భూమి వద్దకు రాకపోకలు సాగించడం దుర్లభమే.


👉రైస్ మిల్ నిర్మాణం కోసం అయితే…


సొసైటీ పక్షాన రైస్ మిల్ నిర్మాణం కోసం భూమి కొనుగోలు చేసి ఉండి ఉంటే, రైస్ మిల్ ఇండస్ట్రియల్ నిబంధనల మేరకు  బాయిల్డ్ రైస్ మిల్లు నిర్మాణం చేపడితే మూడు నుంచి నాలుగు ఎకరాల భూమి ఉండాలి. ‘ రా ‘ రైస్ మిల్ నిర్మాణం కోసం కనీసం ఎకరం కు పైగా భూమి ఉండాలి. మరి కేవలం 0.27 ( ఇరువది ఏడు గుంటలు)  భూమి ఎందుకు కొనుగోలు చేశారో ?  సొసైటీ నిర్వాహకులు మాత్రమే చెప్పాల్సిన అవసరం ఉంది.


👉గుంట కు ₹ 14 వేలు.. ?


సర్వే నెంబర్ 84 లో ఒక ఎకరం  31 గుంటల భూమి (1-031 గుంటలు ) కొనుగోలుకు భూ యజమానితో చర్చించినట్లు రైతుల తెలిపారు. గుంట ఒక్కంటికి ₹ 14 వేల  చొప్పున కొనుగోలుకు ఒప్పందం కుదిరినట్టు చర్చ. అయితే కారణం ఏమిటో  తెలియని కానీ కేవలం 0.27 గుంటలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మిగతా 44 గుంటల భూమిని  సొసైటీ వారు ఏ కారణం చేత రిజిస్ట్రేషన్ చేసుకోలేదో ?  అనేది మిస్టరీగా మారింది. 


ఇది ఇలా ఉండగా మిగతా 0-44 గుంటల భూమిని గుంట ఒక్కంటికి ₹ 7 వేల రూపాయలకు పట్టేదారుకు సొసైటీ నిర్వాహకులకు అనధికారికంగా ఒప్పందం కుదిరినట్టు రైతాంగంలో చర్చ. ధరణి లో ఈ ప్రాంత శివారు భూములలో  కొన్ని మార్పులు చేర్పులకు నాటి డివిజన్ స్థాయి కీలక రెవెన్యూ అధికారి నిరాకరించడంతో కేవలం 0-27 గుంటల భూమి మాత్రమే సొసైటీ పేరున పట్టాయింది. అనే ఆరోపణలు ఉన్నాయి.


👉ఆదాయం అనుభవిస్తున్నది ఎవరు ?


2021 ఫిబ్రవరి 27 న రిజిస్టర్ అయిన 0-27 గుంటల సొసైటీ భూమిలో కొందరు సేద్యం చేసుకుంటున్నారు. వారు పంట ఒక్కంటికి వేలాది రూపాయల కౌలు సొమ్మును సొసైటీకి చెల్లిస్తున్నారా ? ఎవరికి చెల్లిస్తున్నారో ?. అనేది అంతు పట్టని చిదంబర రహస్యం.


👉గొర్రె మేకల దారికి…

గుట్టలో మేకలు వేసే ప్రాంతం.


భీముని లొద్ది గుట్టల్లో  మేకలు గొర్రెలు మెత కు వెళ్లడానికి సొసైటీ భూమి పరిసరాల గుండా వెళ్లాల్సిన దుస్థితి. గొర్రె మేకల రాకపోకల దారి కోసం ఓ సీజన్ కు కొన్ని వేల రూపాయలు మేకల కాపర్లు ఇచ్చినట్టు చర్చ. అయితే ఆ డబ్బులు ఎవరికీ ఇచ్చారో ? ఎంత మొత్తం ఇచ్చారో.? అనే చర్చ కమలాపూర్, నాగారం గ్రామల రైతాంగంలో జరుగుతున్నది. ఇది ఎలా ఉండగా సొసైటీ భూమి అంశంలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

.