దుర్గామాత పూజలలో ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


శ్రీ దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా బుధవారం నియోజకవర్గంలోని గ్రామాల్లో శ్రీ దుర్గా దేవికి ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు.


బుగ్గారం మండలం చిన్నపూర్ గ్రామంలోని స్థానిక హనుమాన్ దేవాలయం వద్ద నిర్వహిస్తున్న దుర్గ శరన్నవరాత్రుల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.


చిన్నాపూర్ గ్రామానికి సంబంధించిన పలు సమస్యలను గ్రామస్తులు, నాయకులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లగా గ్రామ సభ నిర్వహించి సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

👉పెగడపల్లి మండలం లో…


పెగడపెల్లి మండలం బతికపెల్లి, ఐతుపల్లి, నందగిరి గ్రామాల్లో దుర్గ శరన్నవరాత్రుల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.


👉 గొల్లపల్లి మండలంలో…


గొల్లపెళ్లి మండలకేంద్రంలోని దేవి నవరాత్రుల సందర్భంగా రామాలయంలో ఏర్పాటు చేసిన అమ్మవారినీ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
.