గంగారెడ్డి హత్య కు ముందు ఆ గ్రామంలో ఏం జరిగింది ?

J.SURENDER KUMAR,


కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సహచరుడు, మార

గంగారెడ్డి హత్య నేపథ్యంలో సోమవారం రాత్రి జాబితాపూర్

గ్రామంలో ఏం జరిగింది ? అనే చర్చ మొదలైంది.


మంగళవారం జగిత్యాల ఆస్పత్రి ఆవరణలో కొందరు ఆ

గ్రామస్తులు చర్చఇది. వాస్తవాలు. పోలీసుల విచారణలో

వెలుగు చూడవచ్చు.


👉 గ్రామస్తులలో చర్చ ఇలా ..

సోమవారం రాత్రి దాదాపు 7- 8 గంటల సమయంలో రెండు కార్లలో కొందరు పెద్దగా అరుస్తూ గ్రామంలో చెక్కర్లు కొట్టినట్టు చర్చ. మంగళవారం ఉదయం గంగారెడ్డి హోటల్ నుంచి ఇంటికి తన మోటార్ సైకిల్ పై వెళుతుండగా నిందితుడు బత్తిని సంతోష్ , TS 09EE 0736 నంబర్ గల కారుతో వెనుక నుంచి ఢీ కొట్టడంతో మోటార్ సైకిల్ తో సహా కింద పడిన లేచి నిల్చున్న గంగారెడ్డిని కారు లో ఉన్న వ్యక్తి దిగి.( ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న నిందితుడు ) కత్తితో దారుణంగా హతమార్చినట్టు చర్చ.

హత్య గావించబడ్డ మారు గంగారెడ్డి ( ఫైల్ ఫోటో)

కారు ముందు భాగం రక్తం మరకలు ఉండడం, సంఘటనా స్థలం గోడపై ” జీవన్ రెడ్డిని ఎంపీగా గెలిపించండి ” అంటూ ఎన్నికల ప్రచార వాల్ రైటింగ్ ఉండడం, నిందితుడు కత్తిని తన వెంట పెట్టుకొని ఉండడం తో పక్క ప్రణాళికతో ఈ హత్య జరిగి ఉండవచ్చు అనే చర్చ మొదలైంది. హత్యానంతరం నిందితుడు కారును విడిచి జగిత్యాల వైపు పరుగులు తీస్తుండగా కొద్ది దూరంలో మరో కారులో కొందరు ఎక్కించుకొని వెళ్ళినట్టు చర్చ.

అయితే పోలీసుల విచారణలో మాత్రమే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. దాదాపు నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉన్న జగిత్యాల పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగినట్టు చర్చ. ఎవరి కంట పడకుండా అంత త్వరగా నిందితుడు పోలీస్ స్టేషన్ కు కాలినడకన, పరిగెత్తి కూడా వెళ్లడం సాధ్యం కాదని కచ్చితంగా ఏదో ఒక వాహనంలోనే వెళ్లి ఉంటాడనేది చర్చ.

👉గతంలో గంగారెడ్డికి క్షమాపణ చెప్పిన నిందితుడు ?

గంగారెడ్డిని హత్య చేసిన నిందితుడు. అసెంబ్లీ ఎన్నికల తరుణంలో సోషల్ మీడియాలో గంగారెడ్డిని నిన్ను చంపేస్తాను అంటూ వాయిస్ మెసేజ్, లేదా పోస్టు చేసినట్టు గ్రామంలో చర్చ. ఈ నేపథ్యంలో కొందరు గ్రామ ప్రజలు నిందితుడిని ఇలా ఎందుకు చేశావు అంటూ పిలిచి ప్రశ్నించినట్టు చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు, తనది పొరపాటు అంటూ వారి సమక్షంలో ఒప్పుకొని తిరిగి సోషల్ మీడియాలోనే నిందితుడు తనది పొరపాటు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినట్టు చర్చించుకుంటున్నారు. కొన్ని రోజుల తర్వాత గంగారెడ్డిని మరోసారి చంపుతా అనడంతో 100 కు గంగారెడ్డి పై ఫిర్యాదు చేసినట్టు చర్చించుకుంటున్నారు.

హత్యకు జరిగన ప్రదేశం గంగారెడ్డి మృతదేహం రోదిస్తున్న కుటుంబ సభ్యులు

👉రాజకీయ ఆధిపత్యం నేపథ్యంలో..?

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ ఆధిపత్యం కోసమే కొందరు గంగారెడ్డిని హతమార్చిన నిందితుడిని ప్రేరేపించి ఉండవచ్చు అనేది చర్చ. నిందితుడి ఆర్థిక పరిస్థితి మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు తక్కువ దీనికి నిందితుడిపై జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో అనేక కేసులు నవోదయ ఉన్నాయి.

కారు ముందు భాగంలో రక్తపు మరకలు..

👉జగిత్యాలలో రాజకీయ ఆధిపత్య పోరు ?

జగిత్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ సంజయ్ కుమార్, గత కొన్ని నెలల క్రితం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యతిరేకించిన తీరు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఢిల్లీ అధిష్టానం జీవన్ రెడ్డి తో చర్చించి శాంత పరిచిన విషయం తెలిసిందే.

ఎడం మొహం పెడం మొహంగా ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య నామినేటెడ్ పోస్టులు మరింత దూరం పెంచాయి అనేది జగమెరిగిన సత్యం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంకు జిల్లా గ్రంధాలయ సంస్థ , వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ పదవు ల కోసం బండ శంకర్, మార గంగారెడ్డి పేర్లను జీవన్ రెడ్డి అధిష్టానం సిఫారసు చేసారు.

ఇవే పదవులకు మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, నారాయణరెడ్డి పేర్లను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సిఫారసు చేయడంతో ప్రస్తుతం ఆ పదవులు పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇందిరమ్మ కమిటీలలోను ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లు చెరో లిస్టు పంపినట్టు చర్చ. రాజకీయ ఆధిపత్యం కోసమే తమ తమ అనుచరుల పేర్లను సిఫారసు చేశారు తప్ప హత్య రాజకీయాలను ప్రేరేపించే తరహా కక్షలు. వారివి కావు అనేది చర్చ మాత్రమే.

👉పోలీసుల ముందస్తు భద్రత చర్యలు..

గంగారెడ్డి హత్య నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం జాబితాపూర్, జగిత్యాల పట్టణంలో భారీ గా పోలీసు బలగాలను మొహరింపచేశారు. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇంటి వద్ద కూడ పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు.


ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, గంగారెడ్డి హత్యను ఖండిస్తూ, గంగారెడ్డి ని హత్య చేసిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, పోలీసులు అత్యున్నత స్థాయి విచారణ జరిపి గంగారెడ్డి హత్యకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారిని సైతం కఠినంగా శిక్షించాలని పోలీస్ యంత్రాన్ని ఎమ్మెల్యే కోరారు.

👉ప్రభుత్వం సీరియస్..

కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి హత్య తీరును ప్రభుత్వం తీవ్రంగా స్పందించి పోలీసులు అధికారులను హత్య ప్రాథమిక సమాచారం ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, సీఎం కార్యాలయ అధికారులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ను,గంగారెడ్డి దహన సంస్కారాలు ముగిసే వరకు వివరాలను అడిగినట్టు సమాచారం .

👉శాటిలైట్ ఫోటోలు ?

ఇదిలా ఉండగా పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు సంతోష్ ను పోలీస్ లు రహస్య ప్రాంతంలో విచారిస్తూ వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాటిలైట్ ఫోటోల ద్వారా సంఘటన స్థలం, గ్రామ పరిసరాలలో నిందితుడి కదలికలను నిర్ధారించడానికి కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

సంతోష్ సెల్ ఫోన్ స్వాధీన పరుచుకొని కాల్ డాటాను, హత్య జరిగిన ప్రదేశంలో సెల్ టవర్ ఫ్రీక్వెన్సీ లొకేషన్, ఎన్ని ఫోన్ కాల్స్ ఆ ప్రాంతం నుంచి ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ వివరాలతో పాటు, ఇందులో కుట్ర కోణం వెలుగు తీయడానికి మూమెంట్ గూగుల్ లొకేషన్ వివరాల సేకరణ కోసం ఐటి నిపుణులతో పోలీస్ యంత్రాంగం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.