J.SURENDER KUMAR,
కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ గా, తన ఇంటిని ఇందిరా భవన్ గా పేరు పెట్టుకున్న ఆయన మంగళవారం తన సహచరుడు దారుణ హత్య గురైన గంగారెడ్డి మృతదేహాన్ని ఆస్పత్రిలో చూస్తూ కన్నీరు మున్నీరుగా రోదించారు.
ఆయన నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, న్యాయవాదిగా
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గూర్చి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
తన సహచరుడు గంగారెడ్డి హత్యతో జీవన్ రెడ్డి ఉగ్రరూపం దాల్చారు. పోలీస్ యంత్రాంగాన్ని, అదుపుతప్పిన శాంతి భద్రతలు, ప్రతిపక్ష ,తమ పార్టీ నీ సైతం ఆగ్రహంతో ఆవేదనతో తూర్పారపట్టారు.
నా సొంత తమ్ముడిని చంపిన నాకు బాధ ఉండేది కాదు, అంటూ నడిరోడ్డుపై ధర్నా ఆందోళన చేశారు. నేను నలుబది సంవత్సరాలుగా నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ నాకు , నా కార్యకర్తలకు ఇచ్చినా బహుమానం ఇదా ? అంటూ కాంగ్రెస్ అధిష్టానం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీడియా సమావేశంలో నేను పార్టీ మారేది లేదు. పార్టీలో నా పరిస్థితి ఏమిటి ? నా కార్యకర్తల భవిష్యత్తు ఏమిటీ ? అంటూ కాంగ్రెస్ అధిష్టానంను నిలదీశారు.
పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జీవన్ రెడ్డికి ఫోన్ చేసిన మాట్లాడారు, ఆయన తో తన ఆవేదనను, బాధను జీవన్ రెడ్డి వ్యక్తం చేశారు.
ఉదయం హత్య గావించబడ్డ గంగారెడ్డి మృతదేహం దహన సంస్కారాలు ముగిసే వరకు (రాత్రి వరకు) గంగారెడ్డి కుటుంబ సభ్యుల వెన్నంటి జీవన్ రెడ్డి ఉన్నారు.