J.SURENDER KUMAR,
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురికావడం పార్టీకి తీరని లోటు అని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు.
మంగళవారం జాబితాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు గంగారెడ్డిని కత్తితో దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. శనివారం జాబితాపూర్ గ్రామంలో జరిగిన ఆయన కర్మకాండ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మణ్ కుమార్ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

పట్టభద్రులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, నిజాంబాద్ పార్లమెంటు మాజీ సభ్యుడు మధు యాష్కి, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తదితర కాంగ్రెస్ శ్రేణులు గంగారెడ్డి కుటుంబ సభ్యులు పరామర్శించి ఓదార్చారు.