J.SURENDER KUMAR,
ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని ఈత వనాలను పెంచడానికి ప్రభుత్వమే ఈత చెట్లను గీత కార్మికులకు అందిస్తున్నామని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
గొల్లపల్లి, ఎండపల్లి మండలలా పరిధి చిల్వకోడూర్ మరియు లోత్తునూర్ , గుల్లకోట, గ్రామాలకు చెందిన గీతా కార్మికులకు శుక్రవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దాదాపు రెండువందల కాటమయ రక్షణ కవచం ( కిట్లును) ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.
మా గీత కార్మికులకు కటమయ రక్షణ కీట్లను పంపిణీ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని, ఈ కాటమయ కిట్ల వలన గీత కార్మికులకు చాలా ఉపయోగాలు ఉన్నాయని,
అర్హులైన ప్రతి గీత కార్మికుడికి కిట్లను అందేలా చూస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
👉ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం !

గొల్లపెల్లి మండలంలోని వెనుగుమట్ల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులు,మండల నాయకులతో కలిసి శుక్రవారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
.