హైదరాబాదులో మారియట్ హోటల్ విస్తరణ!

J.SURENDER KUMAR,


హైదరాబాద్ నగరంలో మారియట్ ఇంటర్నేషనల్ గ్లోబల్ కేపబులిటీ సెంటర్ (GCC)ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్టు. ఆ సంస్థ సీఎం రేవంత్ రెడ్డికి వివరించింది.


డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మారియట్ ఇంటర్నేషనల్ గ్రూపు ప్రతినిధి బృందం భేటీ అయింది.

గ్రూపు విస్తరణ ప్రణాళికలపై ఈ సందర్భంగా సంస్థ వైఎస్ ప్రెసిడెంట్ డ్ర్యూ పింటో ముఖ్యమంత్రికి వివరించారు. సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు, మారియట్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు పాల్గొన్నారు.