జైలు పోలీసులకు డ్రామా చూపిస్తూ తప్పించుకున్న నేరస్తులు!

👉సీతాదేవి అన్వేషణ పేరిట జైల్ నుంచి జంప్ !

👉ఆరుగురు జైలు అధికారులు సస్పెండ్ !


J.SURENDER KUMAR,

జైలులో శిక్ష అనుభవిస్తున్న కరుడుగట్టిన నేరస్తులు దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జైలు లో శుక్రవారం రాత్రి  ‘రామ్ లీలా’ నాటకం ప్రదర్శిస్తూ జైలు నుంచి తప్పించుకున్నారు. తప్పించుకున్న వారిలో ఇద్దరు నేరస్తులు వానర ( కోతి ) వేషదారులై  సీతాదేవి జాడ కోసం అన్వేషణ ( గాలింపు )  అంటూ జైలు గోడల పైకి ఎక్కి గాలిస్తున్నట్టు నటిస్తూ పారిపోయారు.

👉వివరాల్లోకి వెళితే..

హరిద్వార్ జిల్లా జైలు నుంచి హంతకుడితో సహా ఇద్దరు కరుడుగట్టిన నేరస్థులు పారిపోయినట్లు అధికారులు గుర్తించారు..
సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ ప్రమేంద్ర సింగ్‌ దోవల్‌, జిల్లా మేజిస్ట్రేట్‌ కమేంద్ర సింగ్‌ శనివారం జైలుకు వెళ్లి విచారణ చేపట్టారు.


👉PTI  కథనం మేరకు..


ఖైదీలు పంకజ్ మరియు రాజ్‌కుమార్ నిర్మాణ పనుల కోసం ఆవరణలో ఉన్న నిచ్చెనను ఉపయోగించి పారిపోయారని అధికారులు వెల్లడించారు. వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అన్నారు.
రూర్కీకి చెందిన పంకజ్ అనే వ్యక్తి హత్య కేసులో జీవిత ఖైదును అనుభవిస్తుండగా, ఉత్తరప్రదేశ్‌లోని గోండాకు చెందిన రాజ్‌కుమార్ అనే అండర్ ట్రయల్ ఖైదీ విచారణ ఎదుర్కొంటున్నాడు.

నేరస్తులు తప్పించుకున్న నిచ్చెన


ఈ ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన జైలర్‌తో సహా ఆరుగురు జైలు సిబ్బందిని  సస్పెండ్ చేసి, దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. సస్పెండ్ అయిన వారిలో సూపరింటెండెంట్ ఇన్ ఛార్జి/జైలర్ ప్యారే లాల్ ఆర్య, డిప్యూటీ జైలర్ కున్వర్ పాల్ సింగ్, డే హెడ్ వార్డర్ ప్రేంశంకర్ యాదవ్, హెడ్ వార్డర్ ఇంచార్జి విజయ్ పాల్ సింగ్, బదిరక్షక్ ఇన్‌ఛార్జ్ కన్‌స్ట్రక్షన్ సైట్ ఓంపాల్ సింగ్, మరియు హెడ్ వార్డర్ ఇంచార్జి గేట్ కీపర్ నీలేష్ కుమార్ ఉన్నారు.  విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వారిని సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

తప్పించుకున్న నేరస్తులు వీరే.


ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ దీనిపై విచారణ జరిపి నివేదికను సమర్పిస్తారని డెహ్రాడూన్‌లోని అధికారులు తెలిపారు.


( PTI సౌజన్యంతో )