👉 సాంకేతిక కారణాలతో పెండింగ్ లో ఉన్నవి 4 వేల దరఖాస్తులు !
👉 అర్హత ఉన్న ప్రతి రైతుకు ₹2 లక్షల రుణమాఫీ జరుగుతుంది !
👉 ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లాకు చెందిన 65,970 మంది రైతులకు ₹ 500 కోట్ల రూపాయలతో ప్రతి రైతుకు ₹ 2 లక్షల రుణమాఫీ జరిగింది. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కోసం వచ్చిన దరఖాస్తుల సంఖ్య 4 వేలు , అర్హత ఉన్న ప్రతి రైతుకు ₹ 2 రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రం ఇందిరా భవన్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు.
మీడియా సమావేశంలో ప్రధాన అంశాలు..
👉తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల ఉబిలోకి నెట్టేసి మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చి గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అప్పజెప్పారు…
👉రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రైతులకు ₹2 లక్షల రూపాయల వరకు రుణాలను మాఫీ చేయడం జరిగింది..
👉కొన్ని సాంకేతిక లోపల వల్ల రుణాలు మాఫీ కానీ రైతుల నుండి సంబంధిత వ్యవసాయ అధికారులు దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు 4 వేలకు పైగా దరఖాస్తులు రావడం జరిగింది.

👉65 వేలకు పైగా రైతులకు రుణాలు మాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 4 వేలకు పైగా ఉన్న రైతులకు రుణాలను మాఫీ చేయదా ? మిగిలిన 4 వేల మంది రైతులకు కూడా పూర్తిగా రుణాలు మాఫీ చేయించే బాధ్యత మా ప్రభుత్వానిదే.
👉ధర్నాలు చేసిన నాయకులు ఒక్కసారి గుండెమీద చేయి వేసుకొని చెప్పలి. కేసీఆర్ ఎంతమందికి రుణాలను మాఫీ చేశారు ? వరదల వల్ల నష్టపోయిన ఎంత మంది రైతులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు ? అంటూ ప్రశ్నించారు.
👉జిల్లా కలెక్టర్ తో , వ్యవసాయ అధికారులతో నేను, పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రుణమాఫీ విషయం గురించి మాట్లాడటం జరిగింది, త్వరలోనే మిగిలిన రైతులకు రుణాలు మాఫీ చేస్తాం అన్నారు.
👉రైతాంగానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ స్వార్థం కోసం, స్వలాభం కోసం పనిచేసే ఆ నాయకుల అసత్యపు మాటల్ని నమ్మకండి అన్నారు.
👉గల్ఫ్ కార్మికులు ప్రమాదశాత్తూ ఇతర దేశంలో మృతి చెందితే వారి కుటుంబానికి అండగా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావడం జరిగింది అన్నారు.
👉బి.ఆర్.ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఒక అబద్ధాన్ని పది సార్లు నిజం అని ప్రచారం చేస్తూ ప్రజలను తప్పు తప్పుదారి పట్టిస్తున్నారు ఆరోపించారు.
👉భవిష్యత్తులో రేషన్ కార్డుల జారీ మరియు ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ విషయంలో ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తాం, అర్హులైన ప్రతీ పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తాం అన్నారు.