J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా వక్ఫ్ బోర్డు సభ్యుడిగా ధర్మపురి పట్టణానికి చెందిన మొహమ్మద్ షబ్బీర్ ను ప్రభుత్వం నియమించింది.
కలెక్టర్ సత్య ప్రసాద్ ఈనెల 13న లేఖ సంఖ్య.32-1/A/Wakf/JAGTIAL/2024 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు
కలెక్టర్ అధ్యక్షుడిగా కొనసాగే ఈ బోర్డులో. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అడిషనల్ కలెక్టర్, డిఆర్ఓ, ఆర్డిఓ, మున్సిపల్ కమిషనర్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి, జిల్లా రిజిస్టార్ లతో పాటు శ్రీమతి మహమ్మ ద్ అన్వారి, మహమ్మద్ ఇర్ఫాన్, ( న్యాయవాది ) సభ్యులుగా ఉంటారు.

వీరి పదవి కాలం రెండు సంవత్సరాలు, వక్ఫ్ ఆస్తుల రక్షణ, ఆక్రమణ లు తొలగింపు తదితర వక్ఫ్ సమస్యల విభాగాలు పరిష్కారానికి ప్రభుత్వానికి వివరిస్తుంటారు.
స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ సిఫారసుతో ధర్మపురి పట్టణం కు చెందిన ఇద్దరికీ జిల్లా కమిటీలో నియామకం జరిగింది.