కార్మిక కుటుంబాలలో దీపం వెలిగించిన మహనీయుడు వెంకటస్వామి!

👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,

సింగరేణి కాలరీస్ మూసివేస్తామని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిన సందర్భంలో కేంద్ర మంత్రి ఉన్న కాక ( వెంకటస్వామి ) అప్పటి ప్రధాన మంత్రి తో నిధులను విడుదల చేయించిన కార్మికుల కుటుంబాలలో దీపం వెలిగించిన మహనీయుడు కాక అని గొప్ప వ్యక్తి అని, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ గడ్డం వెంకట స్వామి జయంతి సందర్బంగా శనివారం ధర్మపురిలోని స్థానిక నంది విగ్రహం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..


తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమ పార్టీలు పనిచేస్తున్న సమయంలో వారికి అన్ని విధాలా అండగా ఉండి రాష్ట్రం వస్తే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని భావించిన మహనీయుడు కాక ,


హైదరాబాద్ లో నిరుపేదలు గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తుంటే వెంకట స్వామి అప్పటి ప్రభుత్వంతో పోరాడి ముఖ్యమంత్రి తో మాట్లాడి సుమారు 70 వెల మంది నిరుపేదలకు పట్టాలను పంపిణీ చేయడం జరిగిందని, ఎవరికి ఎటువంటి కష్టం వచ్చిన ముందుండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే మహనీయుడు కాకా గారని ఈ సందర్భంగా తెలిపారు.


👉వెల్లటూరు మండలంలో..


మాజీ కేంద్ర మంత్రి కీ.శే గడ్డం వెంకట స్వామి జయంతి సందర్బంగా వెల్గటూర్ లోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని కాకా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు


👉అమ్మవారికి పూజలు..


ముందుగా దేవి నవరాత్రుల సందర్భంగా వెల్గటూర్ మండలం పాశిగామలోని దుర్గమాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు అర్చకులు అమ్మవారి శాలువాతో సన్మానించి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.


👉ధర్మారంలో


మాజీ కేంద్ర మంత్రి కీ.శే గడ్డం వెంకట స్వామి జయంతి సందర్బంగా ధర్మారం మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని కాక చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి స్వయంగా రక్తాన్ని దానం చేశారు.అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.


పెద ప్రజలకు అండగా ఉండి అట్టడుగు వర్గాల ప్రజల ఉన్నతికి నిరంతరం పాటుపడిన మహోన్నతమైన వ్యక్తి కాక అని ,ఆనాటి తెలంగాణ తొలి ఉద్యమంల్లో బుల్లెట్ గాయాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం కోసం గొంతు విప్పిన మహనీయుడనీ, సోనియా గాంధీ ను ఒప్పించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటనలో ప్రముఖ పాత్ర గడ్డం వెంకటస్వామిది అని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా అన్నారు.


👉నాకు రాజకీయ బిక్ష పెట్టింది ఆయనే..


నేను ధర్మారం నుండి జెడ్పిటిసి సభ్యుడిగా అవకాశం ఇచ్చి ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కాక ఆశీర్వాదంతోనే అని, వారి కుమారుడు వివేక్ ,మనుమడు వంశి అన్ని విషయాల్లో ప్రత్యేకంగా ధర్మపురి నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, నేను అసెంబ్లీలో అడుగు పెట్టేటప్పుడు కూడా కాక గారి విగ్రహానికి పూలమాల వేసి వారిని స్మరించుకుని అసెంబ్లీకి వెళ్లానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు

కార్యక్రమాల్లో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు