👉నవంబర్ 1 నుండి డిసెంబర్ ఒకటి వరకు..
👉గోదావరి కి నిత్య హారతి..o
J.SURENDER KUMAR,
రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో కార్తీకమాసం నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు మరియు దీపోత్సవం కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించాల్సిందిగా సీనియర్ ఐఏఎస్ అధికారిని, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీమతి రామ శైలజ అయ్యంగార్ ఆదేశాలు జారీ చేశారు.

👉దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆదేశాల మేరకు
శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో 02.11.2024 నుండి 01.12.2024 వరకు నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమ వివరాలను ఆలయ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.
👉 ప్రతి రోజు సాయంత్రం 6-00 గంటల నుండి దేవాలయంలో సామూహిక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు మట్టిప్రమిధలు, వత్తులు, నూనె దేవస్థానము.నుండి ఉచితముగా పంపిణీ చేస్తారు.
👉. కార్తీక మాసం సోమవారములు అనగా 4.11.2024, 11.11.2024, .18.11.2024, 25.11.2024, మరియు కార్తీక పౌర్ణమి 15.11.2024 రోజున సాయంత్రం 6-00 గంటల నుండి దేవాలయంలో సామూహిక సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించనున్నారు. పసుపు, కుంకుమ, గాజులు . ఆలయ పక్షాన ప్రసాదంగా పంపిణీ చేయనున్నారు
👉కార్తీక మాసం సందర్భంగా తేదీ 02.11.2024 నుండి 01.12.2024 వరకు ప్రతిరోజు సాయంత్రం 6.30 గం.కు ఆకాశదీపం వెలిగించుట జరుగును.

👉. కార్తీక మాసం సోమవారములు అనగా 4.11.2024, 11.11.2024, 18.11.2024, 25.11.2024, మరియు పంచ రత్నాలలో (పంచ పర్వాలు) అనగా 12.11.2024 నుండి 15.11.2024 వరకు సాయంత్రం 4.30 గంటలకు దేవాలయం నుండి మంగళ వాయిద్యములతో గోదావరి వద్దకు వెళ్లి నది హారతి కార్యక్రమం నిర్వహించ బడును.
👉 14.11.2024 రోజున వైకుంఠ చతుర్దశి సందర్భంగా రాత్రి 8.00 గంటల నుండి భజన/ ప్రవచన కార్యక్రమం నిర్వహించబడును. మరియు రాత్రి 11.00 గం.కు స్వామి వార్లకు క్షీరాభిషేకం అనంతరం లింగోద్భవ పూజ జరుపబడును.
👉 15.11.2024 కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 4-00 గంటల నుండి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు, రాత్రి 7.00 గంటలకు జ్వాలా తోరణం నిర్వహించబడును.
కార్తీక మాసంలో సమయానుకూలముగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించ బడును.
.