J.SURENDER KUMAR,
కాంగ్రెస్ కార్యకర్తల కష్టం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోనే నేను ఎమ్మెల్యేగా గెలిచాను అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి మండలం నక్కలపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మూటపెల్లి శ్రీనివాస్ ప్రమాదవశాత్తు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చాడు. గురువారం రాత్రి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శ్రీనివాస్ ఇంటికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మందులు కొనుగోలు కోసం ₹10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని శ్రీనివాస్ కుటుంబానికి ఎమ్మెల్యే అందించారు.

అనంతరం అదే గ్రామానికి చెందిన సిద్ధం శేఖర్ కు ప్రమాదవశాత్తు చెయ్యి విరిగి ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి రాగ శేఖర్ నీ పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.