J.SURENDER KUMAR,
రైతాంగం కష్టపడి పండించిన ధాన్యం అమ్మకానికి తెచ్చిన కొనుగోలు కేంద్రాల్లో ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత అధికారుల మార్కెట్ కమిటీ పాలకవర్గందే అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మారం మండలంలో పత్తిపాక, నర్సింగపూర్, మల్లాపూర్, కమ్మరికన్ పేట్, కొత్తూర్ గ్రామాలతోపాటు. జూలపెల్లి మండలంలోని అబ్బాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు, మండల నాయకులతో కలిసి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…
ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా వరి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు, రైతులకు ఎటువంటి ఇబ్బందీ ఉన్న తన దృష్టికి తీసుకురావాలని, మార్కెటింగ్ అధికారులు, నూతనంగా నియమకైన మార్కెట్ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలనీ, ఆదేశించారు.

రుణమాఫీ వర్తించని రైతులకు రుణమాఫీ జరిగేలా చూసే బాధ్యత తాను స్వయంగా తీసుకుంటానని, ఈ అంశం ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైతులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.