J.SURENDER KUMAR,
ధర్మపురి లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం ప్రశంసనీయమని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి పట్టణంలో వాణివిద్యాలయం లో శుక్రవారం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, ప్రారంభించారు.
స్థానిక మున్సిపల్ ఛైర్పర్సన్ సంగి సత్తమ్మ పాల్గొన్నారు. ఈ శిబిరంలో ధర్మపురి మరియు పరిసర గ్రామాలనుండి 137మందికి పరీక్షలు చేశారు. అందులో 44 మందికి ఉచిత కంటి ఆపరేషన్ కోసం రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించారు.

ఈ కార్యక్రములో లయన్స్ క్లబ్ అధ్యక్షులు రాపర్తి నర్సయ్య ,సెక్రటరీ స్తంభంకాడి రమేష్, ట్రెజరర్ సిరుప రాజన్న, RCరాజేందర్, ZC ఐ. రామకృష్ణ, DC జక్కు రవీందర్, పిన్న శ్రీనివాస్, .S.దినేష్, వొజ్జల మోహన్, బీమానాతి అశోక్, ఈ. వినోదరావు,, వెంకటేశ్వర్లు, B. మనోహర్ రావు, గట్ల శ్రీనివాస్, మామిడాల రవీందర్, మంతెన శ్రీనివాస్, , కట్ట శ్రీహరి, సజ్జరావు, K.వినయ్, R.హరినాథ్, P. శ్రీనివాస్, K. వెంకటరమణ, పైడి మారుతీ, శ్రీకర్, సాయికృష్ణ, R.శంకరయ్య,K. శ్రవణ్, సంగి శేకర్, రామగిరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.