👉సంగవేని రవీంద్రర్, (రచయిత)
👉గుండారపు శ్రీనివాస్ (జర్నలిస్ట్)
J.SURENDER KUMAR,
మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలుగు సాహిత్య అకాడమిలో జగిత్యాల జిల్లా వాసులు ఇద్దరికీ స్థానం లభించింది. ధర్మపురి నియోజవకర్గానికి చెందిన ప్రముఖ రచయిత సంగవేని రవీంద్రర్, సీనియర్ జర్నలిస్ట్ గుండారపు శ్రీనివాస్ లను మహారాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
మహారాష్ట్రలో మూడున్నర శతాబ్దాల చరిత్ర కలిగిన తెలుగు ప్రజలకు, తెలుగు భాషకు ప్రథమంగా అధికారికంగా గుర్తింపు లభించింది. మహారాష్ట్ర ప్రభుత్వ సాహిత్య అకాడెమీ డైరెక్టర్ సచిన్ నింబాల్కర్ 11 మంది సభ్యులు కమిటీని అధికారికంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ముంబై మహానగరంలో దశాబ్దాల కాలంగా జీవనం కొనసాగించే రవీందర్, శ్రీనివాస్ లు తెలుగు సాహిత్యం, కవి సమ్మేళనాలు, పండుగలు తెలుగు సంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో వీరు చేసిన చేస్తున్న సేవలను అక్కడి ప్రభుత్వం గుర్తించింది.

శెకల్లా గ్రామానికి చెందిన సంగవేని రవీంద్రర్,
తెలుగు రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర (త్వమ్) ప్రధాన కార్యదర్శి, కవి, రచయిత, జర్నలిస్టుగా గుర్తింపు కలిగి ఉన్నారు. ధర్మపురికి చెందిన గుండారపు శ్రీనివాస్ , సీనియర్ జర్నలిస్ట్ గా, మహారాష్ట్ర స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఎంఎస్యుడబ్ల్యుజె) అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

ముంబాయి మట్టుoగా లోని మైసూర్ సమావేశం మందిరం లో శుక్రవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పక్షాన వీరిని అభినందించారు.
వీరితో పాటు తెలుగు సాహిత్యానికి కృషి చేసిన
ప్రముఖ విద్యాసంస్థల అథినేత డాక్టర్ పుచ్చా వెంకట రమణ, ఎఫ్-టాప్ అధ్యక్షులు గంజి జగన్బాబు, యూట్యూబ్ చానెల్ నిర్వాహకులు కంటే అశోక్, ద్విభాషా రచయిత్రి బుదారపు రేణుక, ( సోలాపూర్ ) కనకం సతీశ్, ( చంద్రపూర్ ) కందుకూరి శ్రీనివాస్,( బలహర్ష ) రవీణా చవాన్, కెంచి హరీశ్, (పూణే)
గజానన్ బెజంకివార్ ( యావత్ మాల్ ) సభ్యులుగా నియమించారు.
👉ఈ సందర్భంగా డైరెక్టర్ సచిన్ నింబాల్కర్ మాట్లాడుతూ,
మహారాష్ట్ర స్టేట్ ఒక ప్రగతిశీల రాష్ట్రమనీ, ఇక్కడ అన్ని భాషలను ఆదరించే సంస్కృతి ఉందనీ, అదే కోవలో తెలుగు సాహిత్య అకాడెమీని ప్రభుత్వం ప్రకటించిందనీ, ఈ తెలుగు సాహిత్య అకాడెమీకి నిధులు ప్రభుత్వమే అందిస్తుందన్నారు.
👉తెలుగు సాహిత్యానికి పురస్కారాలు…

ప్రతి సంవత్సరం ఒక సాహితీవేత్తకు ఒక లక్ష రూపాయల పురస్కారం, మరో నలుగురికి ₹ 51 వేల పురస్కారాలు ఉంటాయనీ, దీంతోపాటు ప్రభుత్వ నిబంధనల మేరకు పలు సంస్కృతిక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందనీ, తెలుగు భాషాభిమానులందరూ సహకరించాలని ఆయన విజప్తి చేశారు.

నూతనంగా ఎంపికైన అకాడెమి కార్యాధ్యక్షుడు పి.వి.రమణ మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని నగరాల్లో తెలుగు భాషా వికాసానికి ప్రయత్నిస్తామనీ, నాణ్యమైన తెలుగు సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చేందుకు నిరంతరం శ్రమిస్తామనీ హామీ ఇచ్చారు. కంటే అశోక్ వందన సమర్పణ తో. సమావేశం ముగిసింది.
👉తెలుగుకు గర్వకారణం ముంబై తెలుగు మున్నూరు కాపు సంఘ అధ్యక్షుడు రాములు !

మహారాష్ట్ర ప్రభుత్వం తెలుగు సాహిత్య అకాడమిలో మొదటిసారి ఏర్పాటు చేయడం జగిత్యాల జిల్లా కు చెందిన ఇద్దరిని సభ్యులుగా నియమించడం జగిత్యాల జిల్లాకు గర్వకారణం అని ముంబై తెలుగు మున్నూరు కాపు సంఘ అధ్యక్షుడు శేఖల్ల రాములు హార్షం వ్యక్తం చేశారు.