మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


ధర్మారం మండల కేంద్రంలో ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన సాయి మారుతి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను సోమవారం ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.


ఈ సందర్భంగా క్యాంటీన్ నిర్వహించే మహిళా సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేసి, భోజనం విషయంలో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలనీ, మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, మహిళలకు ఎటువంటి అవసరం ఉన్న నా దృష్టికి తీసుకురావాలని, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు.


అనంతరం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో సుమారు ₹ 62 లక్షల రూపాయల విలువ గల 62 కళ్యాణ లక్ష్మీ చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.