👉ముఖ్య అతిథులుగా ఇద్దరు ప్రభుత్వ విప్ లు !
👉ధర్మపురి ఎమ్మెల్యే ఏ.లక్ష్మణ్ కుమార్, వేములవాడ ఎమ్మెల్యే ఏ.శ్రీనివాస్ !
J.SURENDER KUMAR,
కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండల నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యవర్గ సమావేశానికి ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లు ముఖ్యఅతిథిలు గా కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ జువాడి నరసింహారావు లు పాల్గొన్నారు.
మల్లాపూర్ మండలంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చైర్ పర్సన్ గా అంతడ్పుల పుష్పలత నర్సయ్య, పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
👉 పాఠశాల అభివృద్ధికి సొంత నిధులు..

ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలో బాలుర గురుకుల పాఠశాలలో స్థానిక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సదానందం స్వంత నిధులతో సానిటైజేషన్ పనులను చేపట్టారు. విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాలలో సానిటైజేషన్ పనులను తన స్వంత ఖర్చులతో చేయిస్తున్న సదానందంను అభినందిస్తున్నానన్నారు.
పాఠశాల యాజమాన్యం కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, విద్యార్థుల వసతి విషయంలో ఎటువంటి ఇబ్బందీ ఉన్న నా దృష్టికి తీసుకురావాలని, విద్యారంగం విషయంలో ప్రభుత్వం ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా అన్నారు.