మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


ధర్మపురి అసెంబ్లీ పరిధి బుగ్గారం మండలంలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబ సభ్యులను, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆదివారం ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ పరామర్శించి ఓదార్చారు.


బుగ్గారం మండల కేంద్రానికి చెందిన విలసాగరపు రవి , సిరికొండ గ్రామానికి చెందిన పంచిత లక్ష్మణ్ , ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.

వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. మృతి చెందిన గోపులాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ కొమ్మినేని నారాయణ, గౌడ సంఘ నాయకుడు గాజుల శంకరయ్య, ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను మరియు కూతురు మృతి చెందిన కాంగ్రెస్ నాయకుడు బలుమూరి శ్రీనివాస రావు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు.


బుగ్గారం కు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నక్క మహేందర్ అనారోగ్యానికి గురి గురియే కదలని స్థితిలో ఉన్న ఆయనను ఎమ్మెల్యే పరామర్శించారు.


ఇదే మండలం గోపులాపూర్ గ్రామానికి చెందిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీర్పూర్ శ్రీనివాస్ ను క్యాన్సర్ వ్యాధిన పడ్డ మహేందర్ ల ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. ఎమ్మెల్యే అంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.