నాలా భూమి  తహసిల్దార్ కార్యాలయంలో  రిజిస్ట్రేషన్ !

👉ధర్మపురి సింగిల్ విండో లో ఇదో భూ బాగోతం !


J.SURENDER KUMAR,


రైతుల రుణాలపై వడ్డీ, తదితర సొమ్ములతో ధర్మపురి సింగిల్ విండో  కొనుగోలు చేసిన భూమి  ధర్మపురి సొసైటీ పేరుతో రికార్డులలో నమోదయింది. పట్టేదారు రికార్డులలో  ‘నాలా ‘  NALA ( నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ) అని పేర్కొనబడింది.


ధరణి నిబంధనల ప్రకారం వ్యవసాయతేర భూములు, సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్  జరగాలి.  అయితే ‘ నాలా ‘ గా  ధర్మపురి మండల రెవెన్యూ తాసిల్దార్ కార్యాలయంలో ధర్మపురి వ్యవసాయ సహకార సంఘం పేరున రిజిస్ట్రేషన్ అయినట్టు రికార్డులో స్పష్టంగా ఉంది.


వివరాలు ఇలా ఉన్నాయి..

ధర్మపురి మండలం నాగారం గ్రామ శివారు సర్వేనెంబర్ 84 ఈ/1 లో 0-27 గుంటల ( ఇరువది ఏడు గుంటలు) భూమి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ధర్మపురి పేరున 2021, ఫిబ్రవరి 27 న యాద రవీందర్ అనే తహసిల్దార్ హాయంలో రిజిస్టర్ అయింది. ఈ భూమి పాసుబుక్ నెంబర్ T 18030120460. ఖాతా నెంబర్ 60268 తో నమోదు ఉంది. ( పహానిలో నమోదైన వివరాలు ఇవి )  ఈ సర్వే నెంబర్ భూమి మార్కెట్ విలువ ₹ 337500/-

పాస్ బుక్కులో NALA అని పేర్కొనబడింది.

👉నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ( నాలా)  రిజిస్ట్రేషన్ ఎలా చేశారో ?

ధరణి నిబంధనల ప్రకారం వ్యవసాయ భూములను, మండల రెవెన్యూ కార్యాలయంలో, వ్యవసాయతేర భూములను సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంది.

అయితే సర్వేనెంబర్ 84ఈ/1  ఇరువది ఏడు గుంటల (0-027) భూమి NALA గా పేర్కొంటూ రిజిస్టర్ చేశారు. అయితే బేస్ సర్వేనెంబర్  84 వ్యవసాయ భూమి గా రికార్డులలో ఉంది.  తాసిల్దార్ నిబంధనల మేరకు రిజిస్టర్ చేశారా ?  నాటి బీ ఆర్ఎస్ ప్రభుత్వ నాయకుల రాజకీయ ఒత్తిడితో నిబంధనలను అతిక్రమించి చేశారా ? అనే అంశం విచారణ జరిపితే కానీ వెలుగు చూసే అవకాశం లేదు.

👉 గుంట భూమి నమోదు లో సొసైటీ పేరు. 0-.27 గుంటల భూమి నమోదు లో సొసైటీ పేరుతో పాటు మరో వ్యక్తి పేరు !

ధర్మపురి ప్రాథమిక వ్యవసాయ సంఘ పేరున సర్వేనెంబర్ 25 అ/1అ/1/1/1//2 లో కేవలం ఒకే ఒక గుంట భూమి పట్టేదార్ కాలమ్ లో  PACS-ACT-1964-591TD గా పేర్కొనబడింది. అయితే ఈ  సర్వే నెంబర్ పట్టేదారు కాలమ్ లో వ్యక్తుల పేర్లు లేవు,
ఇదే సొసైటీ కి  సంబంధించిన 0-27 గుంటల భూమి కి నమోదైన రికార్డులలో సొసైటీ పేరుతో పాటు రిప్రజెంటెడ్ అంటూ మరో పేరు నమోదు చేశారు. ఇదే అంతుపట్టని భూ బాగోతానికి ప్రత్యక్ష నిదర్శనం అని రైతాంగం చర్చించుకుంటున్నారు.

👉 కాగితాల్లో నాలా .. కాస్తు  చేస్తున్న  భూమి !

రెవెన్యూ రికార్డులలో నాలా కౌలు కాస్ట్ చేస్తున్న దృశ్యం (ఫైల్ ఫోటో)

సర్వేనెంబర్ .84ఈ/1 లో ని 0-27 గుంటల భూమి లో కొందరు కౌలుకు కాస్తు చేస్తున్నారు, ఇదే భూమి రెవెన్యూ రికార్డులలో మాత్రం ( నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ) ‘ నాలా ‘ గా నమోదయింది.
నాలా భూమిలో కాస్తు చేయవచ్చా ? వ్యవసాయ భూమిని నాలా అంటూ రెవెన్యూ రికార్డులలో నమోదు చేయవచ్చా.? అనే అంశం విచారణ చేపడితే కానీ వెలుగు చూసే అవకాశం లేదు.

👉నాగారం భూసేకరణ లో లోపాలు, నిధులు గోల్ మాల్ కు వివరణ ఇస్తారా ? సొసైటీని సస్పెండ్ చేయమంటారా ?

ధర్మపురి సింగిల్ విండోకు సహకార శాఖ అధికారులు జారీ చేశా నోటీసులో ప్రత్యేకంగా నాగారం లోకొనుగోలు భూమి లో. అభ్యంతరాలను పేర్కొన్నారు ( ఫైల్ కాఫీ)


ధర్మపురి సింగిల్ విండో లో నిధులు  ₹ 1 కోటి, 24 లక్షల,  30 వేల,688 వందల ( ₹ 1,24,30,688 )  గోల్ మాల్ అంశంలో సహకార శాఖ ఉన్నతాధికారుల  లేఖ సంఖ్య 2251/2024-C, తేదీ  25-09-2024 న సొసైటీకి నోటీసు జారీ చేసింది.  వారం రోజుల్లో వివరణ ఇవ్వకుంటే సింగిల్ విండో పాలకవర్గంను డిస్ క్వాలిఫికేషన్ చేస్తామంటూ నోటీసులో పేర్కొన్నారు.

👉ప్రత్యేకంగా నాగారం భూమి విషయంలో..


రాష్ట్ర సహకార  శాఖ ఆడిటర్లు  విధి నిర్వహణలో భాగంగా ధర్మపురి సొసైటీని ఆడిట్ చేశారు.  ప్రత్యేకంగా నాగారంలో భూసేకరణ నిబంధనలకు విరుద్ధంగా ఉందని. అట్టి భూమి స్వాధీనంలో సొసైటీ పాలకవర్గం, కార్యదర్శి విఫలమయ్యారని నోటీస్ లో పేర్కొన్నారు. పలుమార్లు చెప్పిన లోపాలు సరిదిద్దుకోవడం లేదని నాగారం భూమి అంశాన్ని ప్రత్యేకంగా  పేర్కొన్నారు.


ఇదిలా ఉండగా  రైతుల దీర్ఘకాలిక,రుణాల పొందిన కొందరు లబ్ధిదారుల  రుణాలపై విచారణ జరిపితే దీర్ఘకాలిక రుణాల పేరిట జరిగిన అవకతవకలు , వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. రైతుల వాటాదనం, సభ్యత్వం తొలగింపు తదితర వివరాలు తెలియాల్సి ఉంది.