J.SURENDER KUMAR,
బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్వాసితుల కోసం పోరాడిన మాపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రైతులను బెదిరించి భూములు లాక్కున్నారు అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
హైదరాబాద్ అసెంబ్లీలో ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీపై ధ్వజమెత్తారు.
మీడియా సమావేశ ముఖ్యాంశాలు..

👉కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు భూ నిర్వాసితులను పట్టించుకోలేదు..
👉నిర్వాసితుల కష్టాల పైన అప్పటి మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు ఏ నాడు మాట్లాడలేదు..
👉నిర్వాసితులను కలవకుండా ప్రతిపక్ష నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు..
👉ఎకరం 30 లక్షల రూపాయల విలువ చేసే భూములను సరైన పరిహారం ఇవ్వకుండా లాక్కున్నారు..
👉ధర్మపురి నియోజకవర్గంలో రెండు వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకున్నారు..
👉 నిర్వాసితుల గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ కు లేదు..
👉హైరదాబాద్ నాలాల పైన 28 వేల అక్రమ కట్టడాలున్నాయని అధికారంలో ఉన్నప్పుడు కేసీఆరే చెప్పాడు..
👉మూసీ రివర్ బెడ్ లో నివాసం ఏర్పాటు చేసుకున్న వారు స్వచ్ఛందంగా ఖాళీ చేస్తున్నారు..
👉మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూం లు ఇస్తున్నాం..
👉మూసి నిర్వాసితులను బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు..
👉మా ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను ఎక్కడా అడ్డుకోవడం లేదు..
👉బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేయిస్తున్నారు..
👉నాయకత్వం కోసం హరీష్ రావు, కేటీఆర్ పోటీ పడి హడావిడి చేస్తున్నాడు..
👉అక్రమణదారులు పేదలను ముందు పెట్టి మాట్లాడిస్తున్నారు..
👉రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం లపైన చర్చకు వచ్చే దమ్ము కేటీఆర్ కు ఉందా… ?
👉కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర కు ప్రతిపక్షాలు, మీడియా వెళ్లకుండా తాళాలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది..
👉ప్రతిపక్ష నాయకులపైన దాడులు చేయించాల్సిన అవసరం మా సీఎం రేవంత్ రెడ్డికి లేదు..
👉తన పైన వ్యక్తిగతంగా చెత్త వాగుడు వాగిన కౌశిక్ రెడ్డి నే మా సీఎం రేవంత్ రెడ్డి వదిలేశాడు..
👉ప్రతిపక్ష నాయకులకు రక్షణ కల్పించే బాధ్యత మా ప్రభుత్వానికి ఉంది.. మా సీఎం కక్ష సాధింపు చర్యలు దిగరు..
👉బీఆర్ఎస్ నాయకులను ప్రజలు నమ్మరు.. ఆ పార్టీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఖతం అయింది..
👉బీఆర్ఎస్ ఇద్దరు, ముగ్గురు తప్ప మిగిలిన మాజీ నేతలు కనిపించడం లేదు..
👉ఖజానా ఖాళీ చేసి పోయినప్పటికి మా సీఎం రేవంత్ రెడ్డి ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు..
👉ఈడీ దాడులు చేస్తున్నా మా మంత్రి పొంగులేటి సెక్రటేరియట్ కు వచ్చి సమీక్షలు చేశారు..
👉సోషల్ మీడియాలో విష ప్రచారం కోసం బీఆర్ఎస్ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది..