నీతి నిజాయితీకి నిదర్శనం స్వర్గీయ రత్నాకర్ రావు రాజకీయ జీవితం !


👉ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు !


J.SURENDER KUMAR,


నీతి, నిజాయితీ, నైతిక విలువలకు నిదర్శనం స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు రాజకీయ జీవితం అని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఓ గ్రామ సర్పంచ్ గా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన రత్నాకర్ రావు ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంలో అవినీతి అక్రమాలకు ఆస్కారం లేకుండా అత్యున్నత మంత్రి పదవులలో కొనసాగిన ఆయన రాజకీయం ఆదర్శమని మంత్రి అన్నారు.


జగిత్యాల జిల్లా కోరుట్ల వెటర్నరీ కాలేజ్ ఆవరణ లో శుక్రవారం జువ్వాడి రత్నాకర్ రావు జయంతి సందర్బంగా ఆయన విగ్రహాన్ని  పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ, ప్రభుత్వ విప్ లు అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే వినోద్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ భాను ప్రసాద్, ఎంపీ చామల కిరణ్ కుమార్ లతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు.


అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ, భావి తరాలకు దశ దిశ నిర్దేశించి ఆయన జీవితాన్ని అంకితం చేశారన్నారు. మా నాన్న మృతి చెందినప్పుడు   రత్నాకర్ రావు, జీవన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి రాజకీయాల లోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. దేవాదాయ శాఖ మంత్రి గా దీపదూప నైవేద్య కార్యక్రమం, కోరుట్ల లో వెటర్నరీ కాలేజ్, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని వివరించారు.

అలాగే ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ మాట్లాడుతూ,

1989– -90 లో రెండు ఆకుల గుర్తు పై గెలిచి అభివృద్ధి కి కృషి చేశారని, చివరి సారి ఆయన ఆశీస్సులతో ఆసెంబ్లీ లో గెలుపొందానని గుర్తు చేశారు.

ఎంపీ చామల కిరణ్ కుమార్, జువ్వాడి ప్రజలతో మమేకమైన విధానాన్ని యువ నేతలు స్పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రభుత్వ విప్ అడ్లూరి మాట్లాడుతూ, మాజీ మంత్రి రత్నాకర్ రావు తో ఆత్మీయ అనుబంధం ఉందని, నేను ఎన్నికల్లో ఓటమి చెందినప్పుడు కూడా నాకు ఎంతో ధైర్యాన్ని అందించన మంచి వ్యక్తి అని అన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేనప్పటికీ వారి ఆలోచన విధానం, మనం ఆచరణ లో పెట్టినప్పుడే వారికి మనం ఇచ్చే ఘన నివాళి అన్నారు.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ,  రత్నాకర్ రావు నాలుగు దశాబ్దాలుగా కలిసి పని చేశామని, ప్రజా జీవితం లో ఉంటూ సర్పంచ్ నుంచి మంత్రి అయ్యారన్నారు.

ఎమ్మెల్సీ భాను ప్రసాద్ మాట్లాడుతూ, రత్నాకర్ రావు తో ఉన్న అనుబంధం గొప్పదని, ఆయన కృషి వల్లే మూడు సార్లు గెలిచానన్నారు.

ఎంపీ గడ్డం వంశీ కృష్ణ మాట్లాడుతూ,

దివంగత నేత రత్నాకర్ రావు, మా తాతయ్య (కాకా) తో కలిసి రజాకార్ల కు వ్యతిరేఖంగా పోరాటం చేశారని, బిజినెస్ లో డిసిప్లేన్ గా పని చేయాలని నిర్ధేశించే వారన్నారు.


  విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న  మంత్రి  దుద్దిల శ్రీధర్ బాబు . ప్రభుత్వ విప్ లు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ . ఆది శ్రీనివాస్ ఎమ్మెల్సి జీవన్ రెడ్డి .ఎమ్మెల్సి భాను ప్రసాద్ భువనగిరి ఎంపీ కిరణ్ రెడ్డి . పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ  జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్  మాజీ ఎమ్మెల్యే ఆరపెల్లి మోహన్ . కొండూరి రవీందర్ . కూన శ్రీశైలం గౌడ్ . బొమ్మ శ్రీరామ్  జగిత్యాల మున్సిపల్ చేర్మెన్ ఆడువాలా జ్యోతి. కోరుట్ల మున్సిపల్ చేర్మెన్ అన్నం లావణ్య అనిల్. తదితరులు పాల్గొన్నారు.