పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు సన్మానం !

J.SURENDER KUMAR,


తెలంగాణ రాష్ట్ర నూతన పిసీసిగా పదవి బాధ్యతలు స్వీకరించి మొదటి సారి శుక్రవారం నిజామాబాద్ కి వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ కు ఘన సన్మానం జరిగింది. ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సన్మానించారు.


నిజాంబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు ,తుమ్మల నాగేశ్వరరావు , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎంపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ కు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి లక్ష్మణ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.