J.SURENDER KUMAR,
పెగడపల్లి మండలంలో రోడ్ల నిర్మాణం కోసం సి.ఆర్.ఆర్ గ్రాంట్ కింద దాదాపు ₹ 10 కోట్ల నిధులు మంజూరు అయినట్టు ధర్మపురి ఎమ్మెల్యే ,ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

మండలంలోని కీచులటపల్లి గ్రామంలో ప్రభుత్వ నూతనంగా నిర్మించనున్న రోడ్డుకు సంబందించిన రహదారినికి అధికారులు, మండల నాయకులతో కలిసి సోమవారం రోజున ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
పెగడపెల్లి మండలంలోని కీచులాట పల్లి నుండి మల్లాపూర్ జాతీయ రహదారి వరకు నూతన రోడ్డు నిర్మాణం కొరకు ₹ 8.కోట్ల 26 లక్షల రూపాయలు మరియు ఎడుమోటల పల్లి నుండి పేగడ పెల్లి వరకు రోడ్డు నిర్మాణానికి ₹ 2 కోట్ల రూపాయలను సి.ఆర్.ఆర్ గ్రాంట్ కింద ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి,మంత్రులకు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజలు రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి స్వచ్ఛందంగా సహకరించాలని,
కోరారు. అవసరం మేరకు అదనపు నిధులు గూర్చి అధికారులు నివేదికల ఇస్తే అట్టి నిధులు సైతం మంజూరు చేయిస్తానన్నారు
ADVERTISEMENT

👉 ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం !

అనంతరం బతికపల్లి గ్రామంలో నూతంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అధికారులు, మండల నాయకులతో కలిసి ప్రారంభించారు.
రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా ధాన్యం కొనుగోళ్ళు చేయాలని అధికారులను ఇబ్బందిని ఆదేశించారు.