👉అక్టోబర్ 21 నుండి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు ప్రారంభం!
👉జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,
J.SURENDER KUMAR,
పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల సంస్మరణ లో భాగంగా ఈనెల 21న “పోలీస్ ఫ్లాగ్ డే” కార్యక్రమంలో స్మృతి పరేడ్ నిర్వహించి అమర వీరుల త్యాగానికి నివాళులు అర్పించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.
పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం “పోలీస్ ఫ్లాగ్ డే ” సందర్బంగా సంస్మరణ కార్యక్రమాలను అక్టోబర్ 21 నుండి జాతీయ ఐక్యత దినోత్సవం అక్టోబర్ 31వరకు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఇందులో భాగంగా…
👉ఓపెన్ హౌస్ కార్యక్రమం
జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు, పాఠశాలల్లో, కళాశాలలో ఆన్లైన్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులకు పోలీసులు వినియోగించే ఆయుధాలు, చేయు విధులు, అత్యవసర పరిస్థితుల్లో చేయవలసిన అంశాలపై, పోలీసులు చేసిన ప్రతిభ, తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం. ఆఫ్లైన్ ద్వారా ప్రతి పోలీస్ స్టేషన్లో మండల ల వారీగా విద్యార్థులను పోలీస్ స్టేషన్కు ఆహ్వానించి పోలీస్ స్టేషన్ నిర్వహణపై అవగాహనను కల్పించడం జరుగుతుంది.

👉వ్యాసరచన పోటీలు..
ఆన్లైన్ లో https://forms.gle/bYgaoMWk7CLJyVn58 ఈ వెబ్ సైట్ ద్వారా విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరుగుతుంది. వ్యాసరచన పోటీలు మూడు భాషల్లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో అభ్యర్థులు పాల్గొనవచ్చును.
👉వ్యాసరచన పోటీలు కేటగిరీల వారిగా
కేటగిరి-1:
స్టూడెంట్స్ కు ఇంటర్మీడియట్ వరకు(విచక్షణతో కూడిన మొబైల్ ఫోన్ వాడక Judicious usage of mobile phones)
కేటగిరి-2:
డిగ్రీ అండ్ above స్టూడెంట్స్ కు(My role on making Telangana a drug free State ,తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో నా పాత్ర!
అనే అంశాల మీద విద్యార్థులకు “ఆన్లైన్ నందు వ్యాసరచన పోటీలు” నిర్వర్తించడం జరుగుతుంది ఆన్లైన్లో 28 అక్టోబర్ 2024 వరకు సమర్పించవచ్చును.
ప్రతిభ కనబరిచిన ముగ్గురు అభ్యర్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి బహుమతులు అందుకోవాలన్నారు.
👉షార్ట్ ఫిలిమ్స్, ఫోటోగ్రఫీ పోటీలు:
జిల్లా పరిధిలో విద్యార్థిని, విద్యార్థులకు, యువతకు, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు, వీడియో గ్రాఫర్లకు, పోలీసులు చేసిన సేవలకు సంబంధించిన ఫోటోలు లేదా రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, కమ్యూనిటీ పోలీసింగ్, మూఢనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలు అత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన, ప్రకృతి వైపరీత్యాలలో పోలీసుల సేవ, ఇతర పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించే అంశాలపై మూడు నిమిషాలకు మించకుండా షార్ట్ వీడియోలను రూపొందించాలని, ప్రతిభ కనబరిచిన మొదటి మూడు ఫోటోలను, వీడియోలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసి రాష్ట్ర పోటీల్లో పాల్గొనే విధంగా అర్హత లభిస్తుందని తెలియజేశారు.
ఫోటోలు, వీడియోలు ఈనెల తేది: 20-10-24 లోపు సంబంధిత పోలీస్ స్టేషన్లలో అందించాలి.
👉రక్తదాన శిబిర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. పోలీస్ అమరవీరుల స్మరిస్తూ పోలీస్ వారి ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు దగ్గరికి వెళ్లి వారి త్యాగాలకు గుర్తుగా నివాళులు అర్పించడం జరుగుతుంది.
ఈ నెల 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు పబ్లిక్ స్థలాల్లో, పోలీస్ అమరవీరుల గురించి తెలుపుతూ పోలీస్ కళా బృందం తో పాటల కార్యక్రమాలు నిర్వహించడం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ ల పరిదిలోని ప్రధాన కూడళ్ళ వద్ద పోలీస్ అమరవీరుల బ్యానర్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎస్పీ ప్రకటనలో తెలిపారు.