👉 ప్రారంభించిన ఎస్పీ అశోక్ కుమార్
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా పోలీస్ టీం వర్సెస్ ప్రెస్ టీం ల మధ్య శనివారం జరిగిన క్రికెట్ మ్యాచ్ ఉత్సాహంగా సాగింది.
జిల్లా లోని పోలీస్ పరేడ్ మైదానంలో పోలీస్ వర్సెస్ ప్రెస్ మధ్య నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రారంభించారు.
అనంతరం విజేతలకు ఎస్పీ అశోక్ కుమార్ , బహుమతులు అందించారు.ఈ యొక్క క్రికెట్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మరియు బెస్ట్ బ్యాట్స్ మెన్ గా ప్రెస్ టీం నుండి మహేష్ ,బెస్ట్ బౌలర్ గా పోలీస్ టీం నుండి SB ఇన్స్పెక్టర్ఆరీఫ్ అలీ ఖాన్ బహుమతులు అందుకున్నరు
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందని నిత్యం బిజీగా ఉండే పోలీసులు, జర్నలిస్టులు కొంత సేపు ఆహ్లాదకరంగా గడిపారు అని అన్నారు. ప్రెస్, పోలీసుల మధ్య మంచి కోఆర్డినేషన్ ఉండడానికి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరిగిందని. ప్రతి సంవత్సరం ఒక సారి ఈ విధంగా క్రికెట్ మ్యాచ్ కండెక్ట్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికీ ఆటవిడుపు తో పాటు మంచి టీమ్ స్పిరిట్ వస్తుందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీలు రఘునందన్, ఉమ మహేశ్వర్, రంగారెడ్డి, సి.ఐ లు వేణుగోపాల్, కృష్ణ రెడ్డి, ఆరీఫ్ అలీ ఖాన్, , RI వేణు, మరియు ఎస్.ఐ లు, పాత్రికేయులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.