J.SURENDER KUMAR,
క్రీడల్లో ప్రతిభ కలిగి ఉండి ఆర్థిక ఇబ్బందులు క్రీడాకారులను ప్రతిభ వెలికి తీయడానికి అన్ని విధాల వ్యక్తిగతంగా, ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఆదుకుంటాను అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మారం మండలం మేడారం గ్రామంలో నిర్వహిస్తున్న వాలి బాల్ టోర్నమెంట్ ను మంగళవారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
క్రీడాకారులు ఎవరైనా సరే వారి సమస్యలు, క్రీడల్లో పాల్గొనే అవకాశాల గూర్చి నన్ను సంప్రదించాలని, అన్నారు. క్రీడాకారులకు ఎటువంటి అవసరం ఉన్న నా దృష్టికి తీసుకురావాలని వారికి అన్ని విధాలా సహకారం అందిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడాకారులకు అభ్యున్నతికి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా అన్నారు.