ప్రతి శుక్రవారం శ్రీ శారదాంబ శంకరాచార్యులకు అభిషేకం!

J.SURENDER KUMAR,


ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ శారదాంబ శంకరాచార్యుల అభిషేకం ప్రతి శుక్రవారం జరగనున్నది.


భక్తజనం అభిప్రాయాల మేరకు, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజయదశమి పర్వదినం రోజు చేసిన సూచన మేరకు ఆలయ అర్చకులు వేద పండితులు ప్రతి శుక్రవారం శ్రీ శారదాంబ శంకరాచార్యులకు వేదక్తంగా అభిషేకం నిర్వహిస్తున్నారు. యాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ దత్తాత్రేయుడికి సైతం ప్రతి గురువారం అభిషేకం కొనసాగుతున్నది.


శుక్రవారం శ్రీ అమ్మవారి అభిషేకం పూజాది కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
దేవస్థానం పక్షాన ఎమ్మెల్యేకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి శేష వస్త్రం, ప్రసాదం వేదపండితులు అర్చకులు అందజేశారు తదుపరి ప్రదాన దేవాలయం అయిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని అలాగే అనుభంద దేవాలయములలో గల స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.