ప్రతిభ ముందు ప్రణమిల్లిన విజయం !

J.SURENDER KUMAR,


2024 డీఎస్సీ లో ధర్మపురికి చెందిన సుద్ధపల్లి మధు, ప్రతిభ ముందు విజయం ప్రణమిల్లింది. డీఎస్సీలో మధు ఎస్జిటి పోస్ట్ కు ఎంపికయ్యాడు. సీఎం రేవంత్ రెడ్డి ద్వారా నియామకపు ఉత్తర్వులు పొందడానికి బుధవారం హైదరాబాద్ వెళ్లి ఉత్తర్వులు పొందారు.


నిరుపేద కుటుంబానికి చెందిన ఆర్థిక ఇబ్బందులతో ప్రాథమిక విద్యా దశలోనే చదువు ఆపాడు. ఆ పాఠశాల ఉపాధ్యాయురాలు, మరో ఉపాధ్యాయుడు మధు వెన్నంటి ప్రోత్సహించి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పాఠ్యపుస్తకాలు, టీచర్ ట్రైనింగ్, పట్టణ ప్రాంతాల రాకపోకలకు ఆర్థికంగా వారు సహకరించారు.


👉తనకు ఉద్యోగం రావడం పట్ల సుద్ధపల్లి మధు సంతోషం వ్యక్తం చేస్తూ …


👉జిల్లాలో డీఎస్సీ కి 269 ఎంపిక..


హైదరాబాదు లో ఎల్ బి స్టేడియం లో జరుగనున్న ముఖ్యమంత్రి సమావేశానికి జగిత్యాల జిల్లా లో నూతనంగా ఎన్నికైన 269 మంది అభ్యర్థులను డి,ఎస్ ,సి 2024 అభ్యర్థులకు అపాయింట్ మెంట్ ఆర్డర్ లను తీసుకునేందుకు 7 ఆర్టీసీ బస్సులను జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జెండా ఊపి ప్రారంభించిన అదనపు కలెక్టర్ రాంబాబు. ప్రారంభించారు.


ఒక్కొక్క బస్ లో విద్యాశాఖ నుండి ఇద్దరు మండల విద్యాధికారులు ఒక లైసన్ అధికారులు ఒక పోలీసు ,మరియు వైద్య శాఖ నుండి ఒక అధికారిని బస్సులలో వారి వెంట పంపించారు.


ఈ కార్యక్రమంలో విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, AO,DWO అధికారులు, నరేష్, బిసి, ఎస్సీ, అధికారులు, సాయి బాబా, రాజు కుమార్ మైనార్టీ అధికారి, చిత్రు,తదితరులు పాల్గొన్నారు.