👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
సహజసిద్ధంగా ప్రకృతి ప్రసాదించే పువ్వులను పూజలు చేసి ఆరాధించే సంస్కృతి సాంప్రదాయం ఒక్క తెలంగాణ ఆడపడుచులదే అని ప్రపంచంలో ఇలాంటి సాంప్రదాయం ఎక్కడా లేదని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

సద్దుల బతుకమ్మ సందర్భంగా గురువారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురిలో పలుచోట్ల నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.
అనంతరం నవదుర్గ సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవరాత్రోత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు..

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…

ధర్మపురి నియోజకవర్గ ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. పువ్వులను పూజించడం తెలంగాణ గొప్ప సంస్కృతి అని, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దంపట్టే విధంగా బతుకమ్మ వేడుకలను ప్రభుత్వ పక్షాన నిర్వహిస్తున్నామని అన్నారు.

ఎక్కడైనా దేవుళ్లను పూలతో పూజిస్థామని, కానీ పువ్వులనే దేవతగా కొలిచే సాంప్రదాయం ఒక తెలంగాణ లో మాత్రమే ఉందనీ, తెలంగాణ సంస్కృతికి చారిత్రక చిహ్నం బతుకమ్మని మరియు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నయని ఈ సందర్బంగా అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
