రామగిరి ఖిల్లా అభివృద్ధికి 5 కోట్ల నిధులు మంత్రి శ్రీధర్ బాబు !

J.SURENDER KUMAR,


రామగిరి ఖిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు కోట్ల నిధులు మంజూరు తో పాటు మంథనిలోని పురాతన  గౌతమేశ్వర ఆలయానికి రెండు కోట్ల నిధులు మంజూరు చేసిందని మంత్రి  దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు.


మంథని పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎన్టిపిసి వారి ఆధ్వర్యంలో రోహిణి ఫౌండేషన్,  ప్రభుత్వ మరియు ప్రవేట్ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన ఉచిత డెంటల్ – రక్త పరీక్షల కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా హాజరై మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్  ప్రారంభించారు.


విద్యార్థులకు డెంటల్ స్క్రీనింగ్ కిట్టును అందజేసిన అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..


👉ఆరోగ్య పరమైన మంథని మన లక్ష్యంతో అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు.


👉పిల్లల దంతాల సమస్యలకు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.


👉దీర్ఘ కాలిక వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు .


👉ప్రతి విద్యార్థి చదువుకొని ఉన్నత స్థాయిలో అభివృధ్ధి సాధించాలని, చదువు లేకపోతే జరిగిన అరాచకాలు ఎన్నో చూశాం అని తెలిపారు.


👉ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదువుకొని ఎదగాలని, మరొక పదిమందిని తయారు చేయాలని సూచించారు.

A..D..V..T


👉మంథని ప్రాంతాన్ని సరస్వతీ కేంద్రంగాతీర్చిదిద్దుతున్నారు.ఆరోగ్యకరమైన తెలంగాణా కావాలని, అందులో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని కోరారు.


👉మంథని ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం అన్నారు .


కార్యక్రమంలో. రోహిణి ఫౌండేషన్ సంబంధించిన పెద్దలు మరియు వైద్యులు.. అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు