👉ధర్మపురి మార్కెట్ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో
👉చైర్ పర్సన్ గా లావణ్య వైస్ చైర్మన్ గా నరసింహులు !
👉ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి !
J.SURENDER KUMAR,
రైతాంగం పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరలు కల్పించడంతోపాటు ఆ ధాన్యం విక్రయానికి మార్కెట్, కొనుగోలు కేంద్రాల్లోకి తెచ్చినప్పుడు వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత మార్కెట్ కమిటీ పాలకవర్గంపై ఉందని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పట్టభద్రులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లు అన్నారు.

సోమవారం జరిగిన ధర్మపురి మార్కెట్ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుముల లావణ్య లక్ష్మణ్, వైస్ చైర్మన్ సంగ నర్సింహులు, పాలకవర్గ డైరెక్టర్ల చేత జిల్లా మార్కెట్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు,

అనంతరం నూతనంగా నియామకమైన పాలకవర్గ సభ్యులను ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
👉ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

బి.ఆర్.ఎస్ ప్రభుత్వ అరాచక పాలనలో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని, గత ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన కొప్పుల ఈశ్వర్ కనీసం ఇక్కడి రైతుల గూర్చి పట్టించుకోలేదని ఎమ్మెల్యే అన్నారు.
రైతులు అమ్మకానికి తెచ్చిన ధాన్యాన్ని కట్టింగ్ పేరుతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైస్ మిల్లర్లు కుమ్ముకై దోచుకుంటుంటే మంత్రి హోదాలో కనీసం స్పందించలేదని, లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన వెంటనే ₹ 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు రుణాలను మాఫీ చేసి రైతులకు న్యాయం చేశామన్నారు. జగిత్యాల జిల్లాకు సంబంధించి 80 శాతం వరకు రుణమాఫీ పూర్తి చేయడం జరిగిందని,మిగిలిన 20 శాతం రైతులకు రుణాలకు మాఫీ చేసి తీరుతామని,

ఈ ప్రాంత ఇరిగేషన్ విషయంలో కూడా ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రి ని కలిసి వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, త్వరలోనే పత్తిపాక రిజర్వాయర్ ను పూర్తి చేసి రైతాంగానికి నీటిని అందిస్తామని, లిఫ్ట్ లకు కూడా మరమ్మతులు పూర్తి చేయించి తిరిగి వాడుకలోకి తీసుకురావడం జరిగిందని, రోళ్ళ వాగు ప్రాజేక్ట్ కూడా అంచనా వ్యయం పెంచి నప్పటికీ దాన్ని గత ప్రభుత్వంలో పూర్తి చేయలేకపోయారని, దాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ఎవ్వరికీ ఎటువంటి అవసరం ఉన్న నేరుగా నన్ను కలవచ్చని ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ…

తెలంగాణ ఉద్యమం అనంతరం మనం పొందాలనుకున్న ఫలాలు పొండంలో జాప్యం జరిగిందని, వాటిని తిరిగి సాధించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్ళడం జరుగుతుందనీ, ఈ ప్రాంత సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే గా గెలిచిన అనంతరం పాలనలో నన్ను మరిపించే విధంగా ఉందన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మార్కెట్ పాలక వర్గం పైన ఉంటుందనీ, ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనీ, దేశంలో బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా రుణమాఫీ అమలు చేశారా అని, కేవలం కాంగ్రెస్ పాలిత ప్రాంతంలోనే రైతు రుణమాఫీ చేయడం జరిగిందని, చేగ్యమా బాధితులకు వారి పరిహారం అందించడం, గత ప్రభుత్వంలో సాధ్యం కాని, నైట్ కాలేజ్ ని తిరిగి ప్రారంభించిన ఘనత ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కు చెందుతుందనీ ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు..
ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.