👉వారి ఆలోచన విధానాన్ని మనం ఆచరణలో పెట్టినప్పుడే అదే వారికి మనం ఇచ్చే ఘన నివాళి!
👉ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్!
J.SURENDER KUMAR,
అను నిత్యంరైతుల గూర్చి ఆలోచించే మహానుభావుడు స్వర్గీయ మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు, వారి ఆలోచన విధానాన్ని మనం ఆచరణలో పెట్టినప్పుడే అదే వారికి మనం ఇచ్చే ఘన నివాళి అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
రత్నాకర్ రావు జయంతి సందర్భంగా శుక్రవారం ధర్మపురిలోని ఆయన విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని జువ్వాడి కృష్ణ రావు తో కలిసి రత్నాకర్ రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సంధర్బంగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన ధర్మపురి పట్టణానికి చెందిన మల్లికార్జున్ ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం శ్రీవాణి విద్యాలయం మరియు అంగ్లోవేదిక్ కన్వెంట్ హై స్కూల్ యాజమాన్యాల ద్వారా సేకరించిన ₹ 65 వెల రూపాయల నగదును లక్ష్మణ్ కుమార్ వారి కుటుంబానికి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.
మాజీ మంత్రి కీ.శే రత్నాకర్ రావు తో నాకు ఆత్మీయ అనుబంధం ఉందని, మంత్రి శ్రీధర్ బాబు ద్వారా నాకు రత్నాకర్ రావు పరిచయమని, నేను ఎన్నికల్లో ఓటమి చెందినప్పుడు కూడా నాకు ఎంతో ధైర్యాన్ని అందించన మంచి వ్యక్తి అని, రైతుల అభివృద్ధి, ఏ పంటలు వేస్తే అధిక లాభాలు పొందుతారు, వంటి ఎప్పుడు రైతుల గురించి ఆలోచించే గొప్ప నాయకులు రత్నాకర్ రావు, పెద్దమనిషి , భౌతికంగ మన మధ్య లేనప్పటికీ వారి ఆలోచన విధానం, మనం ఆచరణలో పెట్టినప్పుడే అదే వారికి మనం ఇచ్చే ఘన నివాళి అని, అన్నారు. సాగు తాగునీటి కోసం జువ్వడి కృషి చరిత్ర పుటలలో నిలిచిపోతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు