సాంప్రదాయాలు కొనసాగిస్తున్న ముంబై తెలుగు వారికి అభినందనలు!

👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR ,


ముంబై మహానగరంలో తెలంగాణ సనాతన సాంస్కృతిక సాంప్రదాయాలు పండుగలను విజయవంతంగా నిర్వహిస్తూ కొనసాగిస్తున్న ముంబై తెలుగు ప్రజలకు అభినందనలు నమస్కారాలు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ముంబై తెలుగు కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ముంబై లో జరుగుతున్న బతుకమ్మ సంబరాల కార్యక్రమానికి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముంబైలోని తెలుగు సంఘాల నాయకులు లక్ష్మణ్ కుమార్ సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

ముంబై తెలుగు కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాల కార్యక్రమంలో పాల్గొన్నదుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇతర రాష్ట్రంలో ఉన్నప్పటికీ తెలంగాణ సంస్కృతి సాంప్రదామైన బతుకమ్మను మరవకుండ ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని, ఇదే విధంగా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, ముంబైలో ఉన్న తెలంగాణ సోదరీమణులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియేస్తున్నామని అన్నారు.