సాంప్రదాయాలు సనాతన ధర్మాలు గౌరవించాలి సీఎం రేవంత్ రెడ్డి!

J.SURENDER KUMAR,


ఏ రాష్ట్రంలో అయితే ప్రశాంతమైన వాతావరణం నెలకొని, సంప్రదాయాలు కాపాడబడుతాయో, సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించే వాళ్లకు ఎక్కడైతే గౌరవం దక్కుతుందో ఆ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని సంపూర్ణంగా విశ్వసిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.


అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దుండిగల్‌ ఆశ్రమంలో నూతనంగా నిర్మించిన శ్రీ దత్త సభా మంటపాన్ని ముఖ్యమంత్రి బుధవారం ప్రారంభించారు.
శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీ (బాల స్వామీజీ) తో పాటు ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , భక్తులు పాల్గొన్నారు.
అనంతరం మాట్లాడుతూ, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి తెలంగాణకు విచ్చేసినందుకు రాష్ట్ర ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.


దసరా నవరాత్రి ఉత్సవాల ప్రారంభ సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రజలందరికీ ముఖ్యమంత్రి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మైసూర్‌లో జరగాల్సిన దసరా నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలను స్వామీజీ ఇక్కడ నిర్వహించడం తెలంగాణకు శుభ సూచకమని పేర్కొన్నారు.


వేదవ్యాస మహర్షి విరిచితమైన శ్రీమద్భాాగవతానికి పరమపూజ అప్పాజీ రాసిన వ్యాఖ్యాన పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.