J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లోని అతి పురాతన శ్రీ అక్క పెళ్లి రాజరాజేశ్వర స్వామి ఆలయా పాలకవర్గానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
Rc.No.F4/12848/2024 6,Dt:10.10.2024 , ద్వారా ధర్మపురి శ్రీ అక్కపెల్లిరాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానముకు వంశపారంపర్యం కాని ధర్మకర్తల మండలి నియామకము గురించి నోటిఫికేషన్ జారీ చేశారు.

నోటిఫికేషన్ ప్రచురితమైన నాటి నుండి (20) రోజులలో దేవస్థానమునకు ధర్మకర్తగా నియామకమునకు ఆసక్తి గల వారు దరఖాస్తులను నిర్ణీత Proforma (ఫారం-11)లో వివరములు పూరించి కమీషనర్, దేవాదాయశాఖ, హైదరాబాద్ కు లేదా సహాయ కమీషనర్, దేవాదాయశాఖ, కరీంనగర్ కు లేదా ధర్మపురి దేవస్థానము కార్యనిర్వహణాధికారి కి పంపవచ్చును.
👉 నోటిఫికేషన్ ధర్మపురి దేవస్థానము నోటిస్ బోర్డుపై . ధర్మపురి. మున్సిపల్ కార్యాలయములో , మండల పరిషత్ కార్యాలయము, ధర్మపురి నోటిస్ బోర్డుపై దేవదాయ శాఖ ప్రచురించింది.