శ్రీ దుర్గా ఉత్సవాలకు ఎమ్మెల్యేను ఆహ్వానించిన కమిటీ!

J.SURENDER KUMAR,


శ్రీ దుర్గ శరన్నవరాత్రుల సందర్భంగా ధర్మపురి లో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాలకు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ను ఆహ్వానించారు.
శ్రీ నవదుర్గా సేవా సమితి సభ్యులు గురువారం ధర్మపురిలో క్యాంప్ కార్యాలయంలో కలిసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.

👉గొల్లపల్లి మండలం…


శ్రీ దుర్గ శరన్నవరాత్రుల సందర్భంగా గొల్లపెల్లి మండలం శ్రీ రాములపల్లె గ్రామంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాలకు రావలసిందిగా కోరుతూ గురువారం గ్రామస్తులు, ఉత్సవ కమిటీ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ధర్మపురిలో కలసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.

👉ఉచిత నేత్ర వైద్య శిబిరం.

ధర్మపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రేకుర్తి హాస్పిటల్ వారితో ధర్మపురి పట్టణంలో నిర్వహించనున్న ఉచిత నేత్రవైద్య చికిత్స శిబిరానికి హాజరు కావలసిందిగా. లైన్స్ క్లబ్ సభ్యులు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ను ఆహ్వానించారు.
కోరుతూ గురువారం రోజున ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని ధర్మపురి లోని వారి క్యాంపు కార్యాలయంలో లయన్స్ క్లబ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.


👉హోటల్ ప్రారంభోత్సవం..


ధర్మపురి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన హరిత హోటల్ ను ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఎమ్మెల్యే వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు