J.SURENDER KUMAR,
పొనుగోటి శ్రీనివాసరావు , ఆయన ట్రస్టు ద్వారా బడుగు బలహీన పేద ప్రజలకు విద్యా, వైద్యం తదితర అవసరాలను గుర్తించి సహాయ సహకారాలు అందించే సేవ తత్పురుడని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అన్నారు
కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో, నాయకులు, కార్యకర్తలు, ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం పొనుగోటి శ్రీనివాసరావు జన్మదిన వేడుకల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగాఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వెల్గటూర్ మండల. మాజీ ఎంపీపీ శ్రీనివాసరావు, ది రాజకీయ కుటుంబం అన్నారు. వెలగటూర్ మండల అభివృద్ధికి, కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఆయన చేసిన కృషి చేశారని ఎమ్మెల్యే అన్నారు.
ఈ సందర్భంగా కార్యకర్తలు నాయకులు సమక్షంలో ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు.