శ్రీ సిద్ధి వినాయకుని దర్శించుకున్న ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్!

J.SURENDER KUMAR,


ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ముంబై మహానగరంలో కొలువుదీరిన శ్రీ సిద్ధి వినాయకుని ఆదివారం ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.


ఆధ్యాత్మిక కృతజ్ఞతలు వ్యక్తం చేస్తూ, తెలంగాణ రాష్ట్రం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, మరియు తన నియోజకవర్గ ప్రజల సంతోషంగా ఉండాలని శ్రీ సిద్ధి వినాయకుని ప్రార్థించినట్టు ఎమ్మెల్యే ఈ సందర్భంగా అక్కడ ఉన్న తెలుగు వారిని ఉద్దేశించి అన్నారు.


ముంబైలోని తెలుగు అసోసియేషన్ వారి ఆహ్వానం మేరకు బోర్వేలి జరుగుతున్న బతుకమ్మ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వెళ్లారు. ఆదివారం ఉదయం ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో సాయిబాబా నగర్ పోచమ్మ టెంపుల్ ట్రస్ట్ సభ్యులు, మరియు తెలుగు అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ను అనుచరులకు వారు ఘనంగా స్వాగతం పలికారు.