👉527 మంది కళాకారులతో..
J.SURENDER KUMAR,
తిరుమలలో కొనసాగుతున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు కల్పవృక్ష వాహన సేవలో నాలుగు మాడ వీధుల్లో గిరిజనుల ఇతర నృత్యరూపకాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

గ్యాలరీలలో భక్తులను అలరించేందుకు 527 మంది కళాకారులతో మొత్తం 20 బృందాలు వివిధ కళలను ప్రదర్శించారు.

ఈ సాంస్కృతిక బోనాంజాలో భాగంగా కొమ్ము కోయ, గోండు, డప్పులు, లయబద్ధమైన దరువులు, స్టెప్పులు భక్తులను ఆకట్టుకున్నాయి.

అదేవిధంగా ఏపీ, టీఎస్, టీఎన్, కర్ణాటక రాష్ట్రాలతో పాటు జార్ఖండ్‌కు చెందిన కళాకారులు ప్రదర్శించిన కేరళ డ్రమ్స్, తిర్వట్టకళి తదితర కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

అన్ని ప్రాజెక్టుల కార్యక్రమల అధికారులు రామగోపాల్, రాజగోపాల్, ఆనందతీర్థాచార్యులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.



